News November 15, 2024

ఫైల్స్ దగ్ధం.. ఇద్దరు ఆర్డీవోలు, సీనియర్ అసిస్టెంట్‌పై అభియోగాలు

image

AP: మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో దస్త్రాల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 22ఎ అసైన్డ్ భూములపై కొందరు అక్రమంగా హక్కులు సాధించారని, ఆ ఆధారాలు ఉండొద్దనే రికార్డులు తగలబెట్టారని CID ప్రాథమిక నివేదికలో పేర్కొంది. దీనికి ఇద్దరు ఆర్డీవోలు, సీనియర్ అసిస్టెంట్‌ను బాధ్యులుగా గుర్తించిన ప్రభుత్వం వారిపై అభియోగాలు నమోదు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులిచ్చారు.

Similar News

News February 10, 2026

‘జన నాయగన్’ విడుదలకు లైన్ క్లియర్!

image

దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. సెన్సార్ వివాదంలో భాగంగా నిర్మాత వేసిన కేసు ఉపసంహరణకు మద్రాస్ హైకోర్టు అనుమతించింది. దీంతో సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ముందుకు చిత్రం వెళ్లనుంది. క్లియరెన్స్ లభిస్తే ఈ నెలలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. విజయ్ రాజకీయ ఎంట్రీకి ముందు వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

News February 10, 2026

డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ యత్నం.. ఉద్రిక్తత

image

HYDలో డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయం ముట్టడికి బీజేపీ నేతలు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. మక్తల్‌లో ఆరో వార్డు అభ్యర్థి మహదేవప్ప <<19098651>>ఆత్మహత్య<<>> చేసుకోవడంపై కమలం నేతలు ఆందోళనకు దిగారు. అతడి మరణానికి కాంగ్రెస్ పార్టీ వేధింపులే కారణమని నిరసన చేపట్టారు. డీజీపీ ఆఫీసులోకి దూసుకెళ్లబోతుండగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News February 10, 2026

జగన్‌కు జెడ్ ప్లస్ భద్రతను కల్పించాలి: వైసీపీ

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర హోంశాఖకు వైసీపీ లేఖ రాసింది. ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పెంచాలని విజ్ఞప్తి చేసింది. జగన్ పర్యటనల్లో పోలీసులు ఇష్టమొచ్చినట్లుగా చివరి నిమిషంలో రూట్లు మారుస్తున్నారని ఆరోపించింది. ఇటీవల తలెత్తిన భద్రతా లోపాలను ప్రస్తావిస్తూ వాటిపై విచారణ చేపట్టాలని కోరింది.