News December 10, 2024
రాజ్యసభకు నామినేషన్ల దాఖలు

AP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు TDP నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్, BJP నుంచి కృష్ణయ్య నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో వీరు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. వీరి ఏకగ్రీవం లాంఛనమే. YCP నుంచి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, కృష్ణయ్య రాజీనామాతో ఖాళీలు ఏర్పడిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరికి TDP, బీజేపీ నుంచి మళ్లీ అవకాశం దక్కింది.
Similar News
News November 27, 2025
రబ్బరు పాలను ఎలా సేకరిస్తారు?

హెక్టారు రబ్బరు తోట నుంచి ఏడాదికి దాదాపు 2000కి.గ్రా. దిగుబడి వస్తుంది. మొక్క నుంచి వచ్చే పాల కోసం చెట్టుపై బెరడును కొంత తొలగిస్తారు. కాండం నుంచి కారే రబ్బరు పాలను సేకరించడం కోసం డబ్బా లేదా కుండను పెడతారు. ఈ విధానాన్ని టాపింగ్ అంటారు. అయితే మొక్కకు గాటు పెట్టిన దాదాపు 4గంటల పాటు ఈ రబ్బరు పాల రూపంలో కారుతుంది. గడ్డకట్టే రబ్బరు పాలను ఫ్యాక్టరీకి పంపిస్తారు. మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది.
News November 27, 2025
సినిమా అప్డేట్స్

* మహేశ్ బాబు అన్న కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా తెరకెక్కే తొలి చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ టైటిల్ ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్. దీనికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.
* రజినీకాంత్ జైలర్-2 సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
* రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న ‘ధురంధర్’ మూవీ రన్టైమ్ 3.32 గంటలని తెలుస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.
News November 27, 2025
BREAKING: హైకోర్టు కీలక ఉత్తర్వులు

TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది. వారి నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. 1032 పోస్టులకు 2015లో నోటిఫికేషన్ వచ్చింది. అనేక న్యాయ వివాదాల అనంతరం 2019లో ఎంపిక జాబితాను TGPSC విడుదల చేసింది. అయితే మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయంటూ ఆ నియామకాలను సింగిల్ బెంచ్ రద్దు చేసింది.


