News September 24, 2024
ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ

AP: రాష్ట్ర ప్రభుత్వం పలు నామినేటెడ్ <
Similar News
News December 12, 2025
బోయర్ జాతి మేకల ప్రత్యేకతలు ఇవే..

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తి, మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి సాధారణంగా తెల్లటి శరీరం, ఎర్రటి-గోధుమ రంగు తల, పొడవైన వంగి ఉండే చెవులు, వెనుకకు వంగిన బలమైన కొమ్ములు, పొట్టి కాళ్లు ఉంటాయి. మగ మేకలు ఏడాదిలో 70-80KGలు, రెండేళ్లలో 100KGలకుపైగా పెరుగుతాయి. ఇవి ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని, అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. మనదేశంలో చాలా మంది రైతులు వీటిని పెంచుతున్నారు.
News December 12, 2025
‘టెన్త్’ షెడ్యూల్పై వివాదం.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వివరణ

TG: టెన్త్ పరీక్షల షెడ్యూల్ (MAR 14-APR 16) <<18526038>>వివాదంపై<<>> స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వివరణ ఇచ్చారు. ‘పేరెంట్స్, స్టూడెంట్స్ రిక్వెస్ట్తో పరీక్షల మధ్య తగినంత గ్యాప్ ఇచ్చాం. CBSE, ఇతర బోర్డుల విధానాలను అధ్యయనం చేసి సైంటిఫిక్గా షెడ్యూల్ రూపొందించాం. మ్యాథ్స్, సైన్స్, సోషల్కు ఎక్కువ రోజులు సెలవులిచ్చాం. స్టూడెంట్స్ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా రివిజన్ చేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.
News December 12, 2025
IVFతో అప్పుల పాలవుతున్న జంటలు

ప్రస్తుతకాలంలో సంతానలేమి సమస్య పెరగడంతో చాలామంది IVF చికిత్స చేయించుకుంటున్నారు. అయితే దీనివల్ల 90శాతం జంటలు అప్పులపాలవుతున్నట్లు ICMR నివేదికలో వెల్లడైంది. ఈ చికిత్సను ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) పరిధిలోకి తీసుకురావాలని ICMR సూచించింది. ఈ ఖర్చులను కూడా రీయింబర్స్ చేయాలని ఆ నివేదికలో సిఫార్సు చేసింది. దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.


