News December 13, 2024
సినీ ఆర్టిస్టులను టార్గెట్ చేస్తున్నారు: కిషన్ రెడ్డి

అల్లు అర్జున్ అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. షో నిర్వాహకులు ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని చెబుతున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ఈ అరెస్టు జరిగినట్లు అర్థం అవుతోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పోలీసులపై ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సినీ ఆర్టిస్టులను టార్గెట్ చేస్తోందనే విషయాన్ని ఈ అరెస్ట్ గుర్తుచేస్తోందని ట్వీట్ చేశారు.
Similar News
News November 17, 2025
భారత్‌పై పాకిస్థాన్ విజయం

ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నీలో ఇండియా-Aపై పాకిస్థాన్-A విజయం సాధించింది. IND-A నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ఛేదించింది. పాక్ ఓపెనర్ సదాఖత్ 4 సిక్సులు, 7 ఫోర్లతో 79* పరుగులు చేశారు. యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు. కాగా టాస్ సమయంలో పాక్ కెప్టెన్‌కు భారత కెప్టెన్ జితేశ్ శర్మ <<18306948>>షేక్ హ్యాండ్<<>> ఇవ్వకపోవడం గమనార్హం.
News November 17, 2025
పాలనలో తెలుగును ప్రోత్సహించాలి: వెంకయ్య

భాష పోతే మన శ్వాస పోయినట్లేనని, తెలుగు పోతే మన వెలుగు పోయినట్లేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. అదే సమయంలో హిందీని వ్యతిరేకించడంలో అర్థం లేదన్నారు. మన ఎదుగుదలకు హిందీ కూడా ఎంతో అవసరమని తెలిపారు. రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. పాలనలో తెలుగును ప్రోత్సహించాలని, అన్ని ఆదేశాలూ తెలుగులోనే ఇచ్చేలా చొరవ తీసుకోవాలి AP, TG సీఎంలను కోరారు.
News November 17, 2025
TODAY HEADLINES

✦ రాజ్యాంగం వల్లే చాయ్‌వాలా ప్రధాని అయ్యారు: CM CBN
✦ TGకి నాలుగో అద్భుతంగా RFC: CM రేవంత్
✦ రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో CBN, రేవంత్ సరదా ముచ్చట్లు
✦ TGలో రేషన్ కార్డు ఉంటేనే ఇన్కమ్ సర్టిఫికెట్ జారీ
✦ కూటమి ప్రభుత్వంలో భారీగా పెరిగిన అప్పులు: YS జగన్
✦ ఎర్రకోట ఆత్మాహుతి దాడి.. కీలక నిందితుడు అరెస్ట్
✦ తొలి టెస్టులో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం


