News December 23, 2024
బెనిఫిట్ షోలపై నిషేధాన్ని స్వాగతించిన ఫిల్మ్ ఎగ్జిబిటర్లు
TG: బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ ప్రకటించడాన్ని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ స్వాగతించింది. టికెట్ ధరలు నిర్ణీత మొత్తంలోనే, సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు. ధరల పెంపుతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయని, ధరలు తక్కువ ఉంటే ప్రేక్షకులు చూడటానికి వస్తారని తెలిపారు.
Similar News
News December 23, 2024
ఈ మోడల్ ఫోన్లలో WhatsApp పని చేయదు!
పదేళ్లు దాటిన ఆండ్రాయిడ్ కిట్క్యాట్ OSతో పని చేసే ఫోన్లలో JAN 1, 2025 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. శాంసంగ్ గెలాక్సీ S3, S4 మినీ, నోట్2, మోటో జీ, మోటో రేజర్ HD, మోటో E 2014, LG నెక్సస్ 4, LG G2 మినీ, సోనీ ఎక్స్పీరియా Z, SP, V, HTC 1X, 1X+ తదితర మోడల్ ఫోన్లలో వాట్సాప్ సపోర్ట్ చేయదు. అలాగే ఐఓఎస్ 15.1, అంతకంటే పాత వెర్షన్లు వాడుతున్న ఐఫోన్లకూ మే 5 నుంచి ఇదే నిబంధన వర్తించనుంది.
News December 23, 2024
జియోకు SHOCK ఎయిర్టెల్ ROCZZ
రిలయన్స్ జియోకు షాకులు తప్పడం లేదు. సెప్టెంబర్లో 79.7 లక్షల యూజర్లను కోల్పోయిన ఆ కంపెనీ అక్టోబర్లో 37.60 లక్షల యూజర్లను చేజార్చుకుంది. రీఛార్జి ధరలు పెంచినప్పటి నుంచీ ఇదే వరుస. వొడాఫోన్ ఐడియా నష్టం 15.5L VS 19.77Lగా ఉంది. SEPలో 14.35 లక్షల యూజర్లను కోల్పోయిన భారతీ ఎయిర్టెల్ OCTలో 19.28 లక్షల మందిని యాడ్ చేసుకుంది. BSNL యూజర్లు 5 లక్షలు పెరిగారు. సెప్టెంబర్లోని 8.5Lతో పోలిస్తే కొంత తక్కువే.
News December 23, 2024
అమెరికా పర్యటనకు జైశంకర్
విదేశాంగ మంత్రి జైశంకర్ మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరనున్నారు. Dec 29 వరకు ఆగ్రరాజ్యంలో పర్యటిస్తారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆ దేశ విదేశాంగ ప్రతినిధులతో చర్చిస్తారు. అలాగే భారత కాన్సుల్ జనరల్ సదస్సులో పాల్గొంటారు. మరికొన్ని రోజుల్లో బైడెన్ పదవీకాలం ముగుస్తుండడం, ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో జైశంకర్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.