News February 26, 2025
సినీ నిర్మాత మృతి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

TG: సినీ నిర్మాత కేదార్ <<15577363>>మృతిని<<>> KTRకు ముడిపెడుతూ CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా పలువురు అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారని సందేహం వ్యక్తం చేశారు. ముందు సంజీవరెడ్డి, ఆ తర్వాత రాజలింగ మూర్తి, KTR సన్నిహితుడు కేదార్ చనిపోయారని తెలిపారు. ఈ మిస్టీరియస్ మరణాలపై ఆయన ఎందుకు స్పందించలేదని, విచారణ ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. కేదార్ డ్రగ్స్ కేసులో నిందితుడని మీడియాతో చిట్చాట్లో తెలిపారు.
Similar News
News February 26, 2025
దేశ ప్రజలందరికీ కొత్త పెన్షన్ స్కీం

దేశ ప్రజల కోసం యూనివర్సల్ పెన్షన్ స్కీం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ అందించేలా, నిర్మాణ కార్మికులు, గిగ్ వర్కర్లకు మేలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత పెన్షన్ పథకాలనూ దీనిలో చేర్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్న, చేయని వారు, వ్యాపారం చేసే వారూ దీని ప్రయోజనాలు పొందేలా ప్లాన్ చేస్తోంది. త్వరలోనే దీని విధివిధానాలు ప్రకటించనున్నట్లు సమాచారం.
News February 26, 2025
నందమూరి మోక్షజ్ఞకు ప్రశాంత్ వర్మ ఝలక్?

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా నుంచి ప్రశాంత్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్తో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందించేందుకు ప్రశాంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించే అవకాశాలున్నట్లు సమాచారం.
News February 26, 2025
శివరాత్రి.. మీరేం చేస్తున్నారు?

మహాశివరాత్రి రోజు భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి, రాత్రంతా జాగరణ చేస్తూ భగవంతుడి సేవలో తరిస్తారు. కొందరు శైవ క్షేత్రాలలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనడం, శివ కథాపారాయణలు, శివ నామస్మరణ చేయడం, పాటలు వినడం, భక్తి సినిమాలు చూడటం వంటివి చేస్తుంటారు. మరి జాగరణ సమయంలో మీరేం చేస్తారు? కామెంట్ చేయండి.