News May 12, 2024

నటులు లేకుండా AI టెక్నాలజీతోనే సినిమా

image

అన్ని రంగాల్లోనూ AI విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో నటీనటుల అవసరం లేకుండానే AI సినిమాలను నిర్మించగలుగుతోంది. న్యూయార్క్‌లోని AI ఫిల్మ్ ఫెస్టివల్ తాజాగా ఓ పోటీ పెట్టగా, 3వేలకు పైగా AI లఘు చిత్రాలు వచ్చాయి. వీటిలో 10 వీడియోలను ఎంపిక చేసి నిర్వాహకులు ప్రదర్శించారు. ఇవి ఇన్‌సెప్షన్, మ్యాట్రిక్స్, లవింగ్ విన్సెంట్ మూవీలను గుర్తుచేశాయని తెలిపారు. భవిష్యత్తులో పూర్తి నిడివి సినిమాలు సాధ్యమేనని పేర్కొన్నారు.

Similar News

News December 10, 2025

తిరుమల శ్రీవారి చెంత బయటపడ్డ మరో స్కాం

image

కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుడిని మోసం చేసిన మరో స్కాం బయటకొచ్చింది. వేద ఆశీర్వచనం పొందే ప్రముఖులకు ఇచ్చే పట్టువస్త్రాల (సారిగ దుపట్టా) కొనుగోలులో భారీ మోసం, అక్రమాలు జరిగినట్లు TTD విజిలెన్స్ గుర్తించింది. నగరికి చెందిన VRS ఎక్స్‌పోర్ట్స్ ₹100 విలువ చేయని పాలిస్టర్ క్లాత్‌ను పట్టు అని ₹1400కు సరఫరా చేసినట్లు బోర్డుకు తెలిపింది. 2015-25 మధ్య ఇలా శ్రీవారి ఖజానా నుంచి ₹54 కోట్లు దోచుకుంది.

News December 10, 2025

రేపటి నుంచి భవానీ దీక్షల విరమణ

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ప్రారంభంకానున్న భవానీ మండల దీక్ష విరమణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి 7 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గిరి ప్రదక్షిణ కోసం 9 కి.మీ. మార్గాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. భవానీల కోసం 3 హోమగుండాలు, నిత్య అన్నదానం, రైల్వే స్టేషన్- బస్ స్టాండ్‌ల నుంచి బస్సులు ఏర్పాటు చేశారు.

News December 10, 2025

మరోసారి బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తా: ట్రంప్

image

అధ్యక్షుడిగా తన తొలి టర్మ్‌లో US ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే బలమైనదిగా నిలిపానని ట్రంప్ అన్నారు. ఈసారి మరింత పెద్దగా, గతంలో ఎన్నడూ చూడని దృఢమైన వ్యవస్థను నిర్మిస్తానని చెప్పారు. దీని కోసం చాలా శ్రమించాల్సి ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థకు తోడ్పడకపోతే దేశ పౌరులుగా ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి రాకముందు కొత్త ఉద్యోగాలన్నీ వలసదారులకు వెళ్లేవని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు.