News November 29, 2024
3 గంటలకు పైగా రన్ టైమ్ ఉన్న చిత్రాలివే..

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప-2’ రన్ టైమ్ 3 గంటలకుపైనే అని తెలుస్తోంది. తెలుగులో అత్యధిక రన్ టైమ్ కలిగిన చిత్రంగా దానవీరశూరకర్ణ(3.46 గం.) ఉంది. ఆ తర్వాత లవకుశ(3.28 గం.), పాండవ వనవాసం(3.18గం.), పాతాళ భైరవి(3.15గం.) వంటి చిత్రాలు నిడివి ఎక్కువగా ఉండి అప్పట్లో సంచలనాలు సృష్టించాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన అర్జున్ రెడ్డి, RRR వంటి సినిమాల రన్ టైమ్ 3 గంటలకుపైనే కావడం గమనార్హం.
Similar News
News October 23, 2025
మళ్లీ తగ్గిన బంగారం ధరలు

ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.810 తగ్గి ₹1,25,080కు చేరింది. 22 క్యారెట్ల 10g పసిడిపై రూ.750 పతనమై ₹1,14,650గా ఉంది. అటు KG వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,74,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 23, 2025
లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 760 పాయింట్ల లాభంతో 85,200 వద్ద, నిఫ్టీ 200 పాయింట్ల గెయిన్తో 26,085 వద్ద కొనసాగుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టైటాన్, టీసీఎస్, టాటా స్టీల్ లాభాల్లో ఉండగా, మారుతి సుజుకీ, అపోలో హాస్పిటల్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఏడాది తర్వాత నిఫ్టీ 26 వేలు, సెన్సెక్స్ 85 వేల మార్కును చేరుకోవడం గమనార్హం.
News October 23, 2025
మద్యం టెండర్లకు నేటితో ముగియనున్న గడువు

తెలంగాణలో మద్యం టెండర్లకు నేటితో గడువు ముగియనుంది. 2,620 మద్యం షాపులకు ఇప్పటివరకు దాదాపు 90 వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 5 PM వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీంతో అప్లికేషన్లు లక్షకు చేరువయ్యే ఛాన్స్ ఉంది. ఈనెల 27న లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు జరగనుంది. అయితే దరఖాస్తు గడువు ఇప్పటికే ఒకసారి పొడిగించగా.. మరోసారి పెంచే ఛాన్స్ ఉండకపోవచ్చు.