News May 14, 2024

FINAL: మెదక్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 75.09%

image

మెదక్ లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. దుబ్బాక-82.42%, గజ్వేల్-80.31%, మెదక్-80.19%, నర్సాపూర్-84.25%, పటాన్‌చెరు-63.01%, సంగారెడ్డి-71.99%, సిద్దిపేట-73.64%గా నమోదైంది. కాగా ఇక్కడ మొత్తం 75.09% నమోదైంది. ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రాంరెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావు బరిలో ఉన్నారు.

Similar News

News October 7, 2024

MDK: గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్‌లు

image

తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా గ్రంథాలయ బోర్డు ఛైర్‌పర్సన్‌గా చిలుముల సుహాసిని రెడ్డి, సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ బోర్డ్ ఛైర్మన్‌గా గొల్ల అంజయ్యను నియమించింది.

News October 6, 2024

సంగారెడ్డి: రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధులు

image

సంగారెడ్డి జిల్లాలోని రైతులకు 18వ విడత పీఎం కిసాన్ నిధులు రైతులకు సంబంధించిన ఖాతాలలో జమ అయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిధులను వ్యవసాయ పనులకు వినియోగించుకోవడానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు నిధులు జమ కావడంతో సంతోషం వ్యక్తం చేశారు.