News October 22, 2025

స్థానిక ఎన్నికలపై రేపే తుది నిర్ణయం?

image

TG: స్థానిక ఎన్నికలపై నెలకొన్న గందరగోళానికి రేపు తెరపడే అవకాశం కనిపిస్తోంది. పాత పద్ధతిలోనే ఎలక్షన్స్ వెళ్లాలా? లేదా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే నిర్వహించాలా? అనేదానిపై CM రేవంత్ అధ్యక్షతన మ.3 గంటలకు జరిగే క్యాబినెట్ భేటీలో నిర్ణయించనున్నారు. పాత పద్ధతినే అవలంబిస్తే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చే ఆస్కారముంది. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత ఆర్డినెన్స్‌కు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.

Similar News

News October 22, 2025

పట్టణాలు, నగరాల్లో ఇక కామన్ జోనింగ్ విధానం

image

AP: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో జోనింగ్ నిబంధనలు ఒకేమాదిరి కాకుండా వేర్వేరుగా ఉన్నాయి. దీనివల్ల లైసెన్సులు, నిర్మాణ అనుమతులు ఇతర అంశాలలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీని నివారణకు ప్రభుత్వం కామన్ జోనింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ తాజాగా <>GO216 <<>>ఇచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా భారం తగ్గింపు, నిబంధనల సరళీకరణ, sasci ఇన్సెంటివ్‌లు పొందేందుకు వీలుగా కామన్ జోనింగ్‌ను పెడుతున్నట్లు వివరించింది.

News October 22, 2025

రానున్న 5 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు!

image

AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వల్ల రేపు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి 35-55km/h వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శనివారం వరకు జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

News October 22, 2025

BRSకు ముందే తెలుసా?

image

TG: జూబ్లీ‌హిల్స్ ఉప ఎన్నిక వేళ BRS అభ్యర్థి మాగంటి సునీతపై ప్రద్యుమ్న అనే వ్యక్తి చేసిన <<18073070>>ఆరోపణలు<<>> వైరలవుతున్నాయి. ఇలాంటిది ఏదో జరిగి నామినేషన్ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు తప్పవని BRS ముందుగానే ఊహించిందా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌తో నామినేషన్ వేయించిదనే టాక్ విన్పిస్తోంది. ప్రద్యుమ్న ఆరోపణలపై సునీత గానీ, BRS గానీ ఇంకా స్పందించలేదు.