News June 28, 2024
FINAL: దక్షిణాఫ్రికాతో భారత్ అమీతుమీ

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయంతో టీమ్ ఇండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్లో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ నెల 29న బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. కాగా ఇరు జట్లు టోర్నీలో ఓటమే లేకుండా ఫైనల్‌కు చేరుకున్నాయి. దీంతో తుది సమరం రసవత్తరంగా జరగనుంది.
Similar News
News October 27, 2025
ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

AP: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్(మార్చి 2026) ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి భరత్ గుప్తా పేర్కొన్నారు. ఈనెల 22తో ఆ గడువు ముగియగా తాజాగా పొడిగించారు. లేటు ఫీజు రూ.1,000తో నవంబర్ 6వ తేదీవరకు చెల్లించవచ్చని వివరించారు. మరోసారి ఫీజు చెల్లింపు గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు.
News October 27, 2025
గిరిజనులకు 89,845 దోమతెరలు: సత్యకుమార్

AP: అల్లూరి, మన్యం జిల్లాల్లో మలేరియా ఇతర జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 743 గ్రామాల్లోని గిరిజన కుటుంబాలకు 89,845 దోమతెరలను ఉచితంగా అందిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. దీనివల్ల 2 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇందుకు రూ.2.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. దోమలను సంహరించే మందును ఉపయోగించి తయారు చేసే ఈ దోమతెరలను 4 ఏళ్లవరకు వినియోగించొచ్చని తెలిపారు.
News October 27, 2025
మళ్లీ తగ్గిన బంగారం ధరలు!

బంగారం ధరలు గంటల వ్యవధిలోని <<18115652>>మరోసారి<<>> తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,340 తగ్గి రూ.1,23,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,150 పతనమై రూ.1,13,000గా పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,70,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


