News September 8, 2025
బదిలీలపై చివరి దశకు కసరత్తు!

AP: ఆల్ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలపై కసరత్తు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై నిన్న CS, DGP, CMO అధికారులతో CM చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. JCల నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీలు.. SPల నుంచి DIG, IGల వరకు కీలక పోస్టుల్లో కొత్త అధికారులు వచ్చే అవకాశముందని చెబుతున్నాయి. సరైన స్థానంలో సరైన అధికారి అనే కాన్సెప్ట్ కోసం CM కసరత్తు చేస్తున్నారని పేర్కొంటున్నాయి.
Similar News
News September 8, 2025
రూ.20 కోట్ల విలువైన వాచ్ ధరించిన పాండ్య

టీమ్ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తన విలాసవంతమైన జీవనశైలితో మరోసారి వార్తల్లో నిలిచారు. దుబాయ్‌లో జరగనున్న ఆసియా కప్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఆయన రూ.20 కోట్ల విలువైన లగ్జరీ వాచ్ ధరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన వాచ్‌లలో ఒకటి. రిచర్డ్ మిల్లె RM 27-04 మోడల్ వాచ్‌లు ప్రపంచంలో మొత్తం 50 మాత్రమే ఉన్నాయి. ఆసియా కప్ (₹2.6CR) ప్రైజ్ మనీ కంటే వాచ్ ధర దాదాపు పది రెట్లు ఎక్కువ.
News September 8, 2025
ఆధార్‌ను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా పరిగణించాలి: సుప్రీంకోర్టు

ఓటరు గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్‌ను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా పరిగణించాలని ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ ఆధార్ కార్డు జెన్యూన్‌గా ఉందో లేదో సరిచూసుకోవాలని సూచించింది. దీనిని 12వ డాక్యుమెంట్‌గా పరిగణించాలని పేర్కొంది. బీహార్ సమగ్ర ఓటరు సర్వేపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది.
News September 8, 2025
IASల బదిలీ.. TTD ఈవోగా సింఘాల్

ఏపీ ప్రభుత్వం 11 మంది IAS అధికారులను <