News November 21, 2024

ధనుష్-ఐశ్వర్య విడాకులపై తుది తీర్పు ఆరోజే..

image

తమ విడాకుల కేసు విచారణ కోసం నటుడు ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ ఈరోజు చెన్నై ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. వారు మళ్లీ కలవబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి దీంతో ఫుల్‌స్టాప్ పడింది. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి తుది తీర్పును ఈ నెల 27కి వాయిదా వేశారు. 2004లో వీరిద్దరికీ పెళ్లైంది. యాత్ర, లింగా అనే ఇద్దరు కుమారులున్నారు. తాము విడిపోనున్నట్లు 2022, జనవరి 17న సోషల్ మీడియా వేదికగా ధనుష్ ప్రకటించారు.

Similar News

News February 8, 2026

‘విషం’ తాగుతున్నాం.. FSSAI ఏం చేస్తోంది?

image

పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ పాలు, పాల పదార్థాలు వినియోగిస్తారు. అయితే డిటర్జెంట్, యూరియాతో <<19076004>>పాలను<<>> తయారు చేయడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న గుజరాత్‌లో 300 లీటర్ల పాలతో 1,800 లీ. పాలు తయారుచేస్తున్నారని తేలడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉందని, FSSAI ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. తరచూ తనిఖీలు చేసి, కల్తీరాయుళ్లపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

News February 8, 2026

మున్సి‘పోల్స్’: వలస ఓటర్లకు ఫ్లైట్ టికెట్లు.. ముంబై వెళ్లి ప్రచారం

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వినూత్న మార్గాలు ఎంచుకుంటున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగోజిగూడ, తాళ్లసింగారం, లింగారెడ్డి గూడెం, తంగడపల్లి గ్రామాలకు చెందిన సుమారు 200 మంది ఓటర్లు ఉపాధి కోసం ముంబైకి వెళ్లారు. వారిని రప్పించేందుకు విమానం, రైలు, బస్సు ఖర్చులు భరిస్తామని హామీలు ఇస్తున్నారు. కొందరు అభ్యర్థులు స్వయంగా ముంబైకి వెళ్లి ప్రచారం కూడా చేశారు.

News February 8, 2026

నింగిలో నిఘా: శత్రు ఉపగ్రహాలపై భారత్ సరికొత్త ‘స్నూపింగ్’!

image

అహ్మదాబాద్‌కు చెందిన ‘అజిస్తా’ సంస్థ కక్ష్యలో ఉన్న ఇతర ఉపగ్రహాలను ఫొటోలు తీసే (In-orbit imaging) సామర్థ్యాన్ని నిరూపించింది. ఇండియన్ టెక్నాలజీతో తయారైన AFR శాటిలైట్.. వేగంగా కదులుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని స్పష్టంగా ఫొటోల్లో బంధించింది. శత్రువుల కదలికలను పసిగట్టడానికి, అంతరిక్ష ఆస్తులను రక్షించుకోవడానికి, క్షిపణులను ట్రాక్ చేయడానికి ఈ ‘స్పేస్ స్నూపింగ్’ భారత్‌కు కీలకం కానుంది.