News December 1, 2024
రాజ్యసభ ఉపఎన్నికలకు కూటమి అభ్యర్థుల ఖరారు?

AP: రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల ఎంపిక పూర్తైనట్లు తెలుస్తోంది. TDP తరఫున బీద మస్తాన్ రావు, BJP తరఫున R.కృష్ణయ్య బరిలోకి దిగుతారని సమాచారం. అలాగే మరో స్థానం కోసం కంభంపాటి రామ్మోహన్ రావు, భాష్యం రామకృష్ణతోపాటు మరికొందరు ఆశావహులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా మోపిదేవి, మస్తాన్ రావు, కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు వచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News October 14, 2025
ఈ నెలాఖరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా కవిత యాత్ర

TG: జాగృతి చీఫ్ కవిత రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అన్ని జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను ఈ నెలాఖరు నుంచి ప్రారంభిస్తానని తెలిపారు. ఇందులో భాగంగా విద్యావంతులు, మేధావులతో సమావేశాలు నిర్వహించనున్నారు. జాగృతి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లాల నాయకులకు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. షెడ్యూల్, సమావేశాల వివరాలతో రేపు యాత్ర పోస్టర్‌ను రిలీజ్ చేస్తారని సమాచారం.
News October 14, 2025
IRCTCలో 45 పోస్టులు

IRCTC 45 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 15 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.9,600 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్సైట్: https://irctc.com/
News October 14, 2025
రైడెన్‌తో వచ్చే ఉద్యోగాలెన్నో చెప్పాలి : YCP

AP: విశాఖలో గూగుల్ రైడెన్ సంస్థ డేటా సెంటర్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ప్రభుత్వం చెప్పాలని YCP డిమాండ్ చేసింది. ‘ఆ సంస్థకు 500 ఎకరాలు, ₹22వేల కోట్ల రాయితీలిస్తున్నారు. రోజుకు 24 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరం. కనీసం 20వేల ఉద్యోగాలైనా రావాలి. కానీ డేటా సెంటర్‌తో అన్ని జాబ్‌లు రావు. డెవలప్మెంటు సెంటర్‌తో ఐటీ పార్కును అభివృద్ధి చేయాలి’ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు.