News December 2, 2024
ఆఖర్లో లాభాలు ఆదుకున్నాయి

బెంచ్ మార్క్ సూచీలు Mon రోజంతా కన్సాలిడేషన్ జోన్లో కదిలినా ఆఖర్లో లాభాలతో ఆదుకున్నాయి. Sensex 445 పాయింట్ల లాభంతో 80,248 వద్ద, Nifty 144 పాయింట్ల లాభంతో 24,276 వద్ద స్థిరపడ్డాయి. రియల్టీ షేర్లు 3% లాభపడగా ఆటో, IT, మెటల్ రంగాలు ఒక శాతం వరకు ఎగసి మార్కెట్లను లాభాల్లో నిలిపాయి. Ultra Cemco, Apollo Hospitals 3 శాతానికిపైగా లాభపడ్డాయి. HDFC, NTPC, Cipla, Sbi Life టాప్ లూజర్స్.
Similar News
News November 13, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 13, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 13, 2025
పాకిస్థాన్తో సిరీస్ కొనసాగుతుంది: శ్రీలంక

ఇస్లామాబాద్లో పేలుడు నేపథ్యంలో పలువురు శ్రీలంక ప్లేయర్లు పాకిస్థాన్ వీడుతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ కొనసాగుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన జారీ చేసింది. ప్లేయర్లు, సిబ్బందికి తగిన భద్రతను పాక్ కల్పిస్తుందని స్పష్టం చేసింది. ఎవరైనా జట్టును వీడితే వారి స్థానంలో ఇతర ప్లేయర్లను రీప్లేస్ చేస్తామని పేర్కొంది. ఇవాళ పాక్-శ్రీలంక మధ్య రెండో వన్డే జరగనుంది.
News November 13, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


