News March 30, 2024
ఎట్టకేలకు జపాన్‌లో ‘ఒపన్‌హైమర్’ విడుదల!

ఆస్కార్ గెలిచిన ‘ఒపన్‌హైమర్’ సినిమా ఎట్టకేలకు జపాన్‌లో విడుదలైంది. రాబర్ట్ ఒపన్‌హైమర్ తయారుచేసిన అణ్వాయుధాల కారణంగా 1945లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి ప్రాంతాలు నాశనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అమెరికాలో గత జులైలోనే విడుదలైన ఆ సినిమాను జపాన్‌లో ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అయితే తాజాగా ధైర్యం చేసి సినిమాను విడుదల చేశామని మేకర్లు ప్రకటించారు.
Similar News
News October 20, 2025
ప్రపంచం మొత్తానికి మీరు బాసా?.. ట్రంప్‌పై ఖమేనీ ఫైర్

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. ‘మీరు మా న్యూక్లియర్ సైట్లను ధ్వంసం చేశామని చెబుతున్నారు. మీ ఊహల్లో మీరు ఉండండి’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీరు మా సైంటిస్టులను చంపేశారు. కానీ వారి నాలెడ్జ్‌ను కాదు. ఒక దేశానికి న్యూక్లియర్ ఇండస్ట్రీ ఉంటే మీకు ఎందుకు? జోక్యం చేసుకోవడానికి మీరు ఎవరు? ప్రపంచం మొత్తానికి మిమ్మల్ని ఎన్నుకున్నారా?’ అని ప్రశ్నించారు.
News October 20, 2025
మన ఆచారాల వెనుక దాగున్న సైన్స్

మన సంప్రదాయాలు, ఆచారాల వెనుక ఆధ్యాత్మిక కారణాలే కాదు! ఆరోగ్య, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మన పెద్దలు చెప్పులు ఇంటి బయటే వదలమంటారు. బయటకు వెళ్లి రాగానే కాళ్లూచేతులు కడగమంటారు. పుడితే పురుడని, మరణిస్తే అంటు అని అందరికీ దూరంగా ఉండాలంటారు. సెలూన్‌కి వెళ్తే స్నానం చేయనిదే ఇంట్లోకి రానివ్వరు. మహిళలు స్నానం చేయనిదే వండొద్దని అంటారు. వీటికి కారణం క్రిములను ఇంట్లోకి రాకుండా నిరోధించడమే.
News October 20, 2025
ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపేస్తాయి: చిరంజీవి

నాగార్జున, వెంకటేశ్, నయనతారతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ‘ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపేస్తాయి. ప్రేమ, నవ్వు, కలిసి ఉండటం వల్ల జీవితం వెలిగిపోతుందన్న విషయాన్ని గుర్తు చేస్తాయి’ అని ట్వీట్ చేశారు. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీలో హీరోయిన్గా నయనతార, స్పెషల్ రోల్లో వెంకీ మామ కనిపించనున్నారు.