News March 19, 2025

నేడు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి

image

TG: ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క నేడు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో 2025-26 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఏడాది పద్దులు రూ.3లక్షల కోట్లకు పైగానే ఉండనున్నట్లు సమాచారం. 2024-25 పద్దు రూ.2.90 లక్షల కోట్లు కాగా ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ఇదే.

Similar News

News March 19, 2025

2025-26 బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

image

TG: 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాసేపట్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు నల్లపోచమ్మ గుడిలో బడ్జెట్ ప్రతులను ఉంచి భట్టి ప్రత్యేక పూజలు చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలి సారి. కాగా బడ్జెట్ రూ.3లక్షల కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా.

News March 19, 2025

రికార్డు దిశగా గోల్డ్ ధరలు!

image

బంగారం ధరలు పెరుగుతుండటం చూస్తుంటే త్వరలోనే రూ.లక్షకు చేరేలా కనిపిస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.82,900లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగడంతో రూ.90,440కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.1000 పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,14,000గా ఉంది. శుభకార్యాల నేపథ్యంలో బంగారానికి భారీ డిమాండ్ నెలకొంది.

News March 19, 2025

వైసీపీకి ఎమ్మెల్సీ రాజీనామా

image

AP: వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు(పోతుల సునీత, కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ) రాజీనామా చేశారు. రాజశేఖర్ 2004లో చిలకలూరిపేటలో స్వతంత్ర MLA అభ్యర్థిగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ వైసీపీని స్థాపించాక ఆ పార్టీలో జాయిన్ అయ్యారు.

error: Content is protected !!