News January 31, 2025

పాత ఇందిరమ్మ ఇళ్లకూ ఆర్థికసాయం?

image

TG: ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు పొంది సొంత నిధులతో వాటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న వారికి ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఆర్థిక సాయం పూర్తిగా అందని, సగం డబ్బులు పొందిన లబ్ధిదారులకు సాయం చేయనున్నట్లు తెలుస్తోంది. అప్పటి ప్రభుత్వం ఎంత అమౌంట్ ఇచ్చింది, ఇంకెంత ఇవ్వాల్సి ఉందనే వివరాలను హౌసింగ్ శాఖ సేకరించింది. ఇలాంటి లబ్ధిదారులు సుమారు 2 లక్షల మంది ఉంటారని అంచనా.

Similar News

News November 11, 2025

ఖమ్మంలో కొత్త రేషన్ కార్డుల జోరు

image

పేదలకు ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీని వేగవంతం చేసింది. జనవరి నాటి 4,11,143 కార్డులకు అదనంగా 52,406 కొత్త కార్డులు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కార్డుల సంఖ్య 4,63,549కి చేరింది. ఏప్రిల్ 1 నుంచి ఉచిత సన్న బియ్యం పంపిణీ జరగడంతో కొత్తగా లబ్ధి పొందుతున్న వారికి ఉపశమనం లభించింది.

News November 11, 2025

‘SIR’పై నేటి నుంచి సుప్రీంలో విచారణ

image

దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ(SIR)ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై SCలో నేటి నుంచి విచారణ జరగనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం వాదనలు విననుంది. అయితే కొత్తగా దాఖలయ్యే పిటిషన్లు ఏమైనా ఉంటే చీఫ్ జస్టిస్ గవాయ్ సమక్షంలో ప్రవేశపెట్టాలని ధర్మాసనం సూచించింది. SIRను వ్యతిరేకిస్తూ బెంగాల్ కాంగ్రెస్‌తో పాటు ADR స్వచ్ఛంద సంస్థ పిటిషన్లు వేశాయి.

News November 11, 2025

అయ్యప్ప దీక్షా నియమాలు (1/2)

image

☞ దీక్షలో ఎల్లప్పుడూ మాల ధరించే ఉండాలి.
☞ ఎప్పుడూ నల్లని దీక్షా వస్త్రాలు మాత్రమే ధరించాలి.
☞ విభూతి, చందనం, కుంకుమ ధరించాలి.
☞ పూజ, భిక్ష సమయాల్లో చొక్కా ధరించకూడదు.
☞ కఠిన బ్రహ్మచర్యం పాటించాలి.
☞ నేలమీద నిద్రపోవాలి. మంచంపై కూర్చోరాదు.
☞ క్షురకర్మ చేయించుకోరాదు. గోళ్లు తీయకూడదు.
☞ కోపాన్ని వీడాలి. అబద్ధాలకూడదు. ☞ పాదరక్షలు ధరించరాదు. <<-se>>#AyyappaMala<<>>