News September 11, 2025
ఉత్తరాఖండ్‌కు రూ.1200 కోట్ల ఆర్థిక సాయం

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌కు ప్రధాని మోదీ రూ.1200 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇవాళ డెహ్రాడూన్ వెళ్లిన ప్రధాని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. అంతకుముందు పంజాబ్‌కు రూ.1600 కోట్లు, హిమాచల్‌ప్రదేశ్‌కు రూ.1500 కోట్లు ప్రకటించారు.
Similar News
News March 26, 2026
నియోజకవర్గాలు 50శాతం పెరుగుతాయి: చంద్రబాబు

నియోజకవర్గాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 50శాతం నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు. దీని ద్వారా ఎక్కువ మందికి రాజకీయ అవకాశాలు వస్తాయని చెప్పారు. నియోజకవర్గాల పెంపు వల్ల పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని, దీనిపై ప్రజలకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు.
News March 26, 2026
ALERT: టేస్ట్ కోసం చూస్తే.. ప్రాణాపాయమే!

ఫాస్ట్‌ఫుడ్‌ను లొట్టలేసుకుంటూ తింటున్నారా? అయితే మీరు డయాబెటిక్ వ్యాధిని కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు వైద్యులు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే TG, AP, TN, కేరళం, కర్ణాటకలో ఫాస్ట్‌ఫుడ్ వినియోగం పెరిగిందని IJMR స్టడీ వెల్లడించింది. బయటి ఆహారంపై ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే షుగర్, ఊబకాయం బారిన పడే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. రూరల్ ఏరియాలో కంటే సిటీల్లో దీని వినియోగం ఎక్కువగా ఉంది.
News March 26, 2026
కరెంట్ అఫైర్స్

* JNTUH బీటెక్ విద్యార్థి శివకుమార్ ఇందూరికి ‘జలశక్తి హ్యాకథాన్ 2025’ పురస్కారం.
* సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 1,05,07,879.
* నగరాల్లోని వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఢిల్లీ ప్రభుత్వం, IIT మద్రాస్ రోడ్లపై ‘పొగమంచును హరించే’ టైటానియం డయాక్సైడ్ పూతలను పరీక్షిస్తున్నాయి.
* పుణేలోని శాస్త్రవేత్తలు Neoloboptera peninsularis అనే కొత్త బొద్దింక జాతిని కనుగొన్నారు.


