News September 17, 2025

రూ.15 వేల ఆర్థికసాయం.. నేటి నుంచే అప్లికేషన్లు

image

AP: ఆటో/క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అర్హులైన వారు నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం రిలీజ్ చేసిన ప్రత్యేక <<17731468>>ఫామ్‌లో<<>> వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలి. ఎంపికైన డ్రైవర్ల అకౌంట్లలో అక్టోబర్‌ 1న ప్రభుత్వం నగదు జమ చేయనుంది.

Similar News

News January 31, 2026

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ₹8,620 తగ్గి ₹1,60,580కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹7,900 తగ్గి ₹1,47,200గా నమోదైంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.

News January 31, 2026

మహిళల్లో క్యాన్సర్ ముప్పును పెంచే అలవాట్లు

image

సిగరెట్లు తాగే, మద్యం తాగే మహిళలకు పురుషుల కంటే క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. పొగాకులోని హానికారకాలకు మహిళల్లోని కొన్ని ఎంజైమ్‌లు, హార్మోన్లు స్పందించే తీరు భిన్నంగా ఉంటుందని ఇది క్యాన్సర్‌ కారకంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు గుండె జబ్బులు, ఎంఫిసెమా, ఇతర తీవ్రమైన అనారోగ్యాల ముప్పును కూడా పెంచుతుంది.

News January 31, 2026

కశ్మీర్‌లో ఉగ్రవాదులతో భీకర పోరు

image

JKలోని కిష్తవార్ జిల్లా దోల్గాంలో శనివారం తెల్లవారుజామున భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ మొదలైంది. జనవరి 18న మొదలైన ఆపరేషన్ త్రాషి-Iలో భాగంగా భారత ఆర్మీ, JK పోలీసులు, CRPF సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడే నక్కిన ముగ్గురు జైషే ఉగ్రవాదులు బలగాలకు తారసపడ్డారు. వారు కాల్పులు జరపటంతో.. బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.