News March 29, 2024

DSC అభ్యర్థులకు రూ.1,500 ఆర్థిక సాయం.. 7 రోజులే గడువు

image

TG: ఇటీవల 11,062 పోస్టులతో విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరీక్షకు సన్నద్ధమయ్యే BC అభ్యర్థులకు పుస్తకాల కోసం బీసీ స్టడీ సర్కిల్ రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10వేల మందికి లబ్ధి చేకూరనుంది. దీనికోసం <>https://tsbcstudycircle.cgg.gov.in/<<>> వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 5లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Similar News

News March 26, 2026

ఏప్రిల్ 4 నుంచి టెన్త్ వాల్యుయేషన్

image

APలో ఈ నెల 16 నుంచి కొనసాగుతోన్న టెన్త్ ఎగ్జామ్స్ APR 2తో ముగుస్తాయి. వచ్చే నెల 4 నుంచి 13 మధ్య వాల్యుయేషన్ పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. ఈసారి ట్యాబ్స్ ద్వారా మూల్యాంకనం సెంటర్లలోనే మార్కులను నమోదు చేస్తారన్నారు. అన్ని కేంద్రాల్లో CCTVలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా APR మూడో వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.

News March 26, 2026

నేపాల్‌లో లీటర్ పెట్రోల్ రూ.187

image

యుద్ధ ప్రభావంతో నేపాల్‌లో పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌ ధరలు లీటరుకు రూ.15 (నేపాల్ కరెన్సీ)చొప్పున పెరిగాయి. కేటగిరీ-1 ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.184.50, కేటగిరీ-2లో రూ.186, కేటగిరీ-3లో రూ.187గా ఉంది. ఆయా ప్రాంతాలను బట్టి డీజిల్, కిరోసిన్ రేట్లు రూ.164.50, రూ.166గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ధరలకు అనుగుణంగా దేశీయంగా రేట్ల పెంపు తప్పలేదని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది.

News March 26, 2026

ధురంధర్-2పై ఏఐ వీడియోలు.. డైరెక్టర్ వార్నింగ్

image

ధురంధర్-2 సినిమాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణకు డైరెక్టర్ ఆదిత్య ధర్ ధన్యవాదాలు తెలిపారు. అయితే కొందరు చిత్రంలోని సన్నివేశాలను AIతో మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘హమ్జా పాత్ర తలపాగా ధరించి ధూమపానం చేస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇది అవాస్తవం. రెచ్చగొట్టడానికి, గందరగోళం సృష్టించడానికి ఇలా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని SMలో హెచ్చరించారు.