News July 17, 2024
అతని ఆచూకీ కనిపెట్టండి: పవన్ కళ్యాణ్

AP: నరసాపురం MPDO వెంకటరమణ అదృశ్యంపై విచారించాలని డిప్యూటీ CM పవన్ అధికారులను ఆదేశించారు. అదృశ్యానికి దారి తీసిన పరిస్థితులపై ఆరా తీయాలన్నారు. నరసాపురం ఫెర్రీ బకాయిల వివరాలను తనకు అందించాలన్నారు. కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాగా ఫెర్రీ బకాయిలు ₹55లక్షలను YCP నేతల అండతో కాంట్రాక్టర్ చెల్లించకపోవడంతో తనను బాధ్యుడిని చేస్తారనే భయంతో MPDO అదృశ్యమైనట్లు తెలుస్తోంది.
Similar News
News November 26, 2025
iBOMMA రవి కేసులో ట్విస్ట్.. పైరసీ చేయకుండా..!

iBOMMA రవి నేరుగా సినిమాలు పైరసీ చేయలేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. టెలిగ్రామ్, మూవీరూల్జ్, తమిళ్ఎంవీ లాంటి పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసేవాడని తెలిపారు. క్వాలిటీ తక్కువగా ఉన్న ఆ సినిమాలను టెక్నాలజీ సాయంతో HD క్వాలిటీలోకి మార్చి ఐబొమ్మ, బప్పం సైట్లలో పోస్ట్ చేసేవాడని చెప్పారు. అయితే గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ రూ.20 కోట్ల వరకు సంపాదించినట్లు గుర్తించారు.
News November 26, 2025
Official: అహ్మదాబాద్‌లో కామన్ వెల్త్ గేమ్స్

2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్ అధికారికంగా ఖరారైంది. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నిర్వహించిన కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో 74 దేశాల ప్రతినిధులు ఇండియా బిడ్‌కు ఆమోదం తెలిపారు. ఇందులో 15-17 క్రీడలు ఉండనున్నాయి. వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే గేమ్స్‌లో మాత్రం 10 స్పోర్ట్స్ ఉండనున్నాయి. కాగా 2030లో జరగబోయేవి శతాబ్ది గేమ్స్ కావడం గమనార్హం.
News November 26, 2025
₹7,280 కోట్లతో రేర్ ఎర్త్ మాగ్నెట్స్ పథకం

రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎగుమతులపై చైనా ఆంక్షల నేపథ్యంలో కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్స్ తయారీని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఏటా 6K మెట్రిక్ టన్నుల సామర్థ్యమే లక్ష్యంగా ₹7,280 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపింది. గ్లోబల్ బిడ్డింగ్‌తో 5 సంస్థలను ఎంపిక చేస్తామని, ఒక్కో సంస్థకు 1,200 MTPA సామర్థ్యం నిర్దేశిస్తామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.


