News September 23, 2024
గుండె ఆరోగ్యంగా ఉందో లేదో ఇలా తెలుసుకోండి!

ఆగకుండా 45 నిమిషాల పాటు నడవగలిగితే మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్లేనని ముంబై లీలావతి హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డా.రవీందర్ తెలిపారు. అయితే వయసు, లింగాన్ని బట్టి కొన్ని మార్పులుంటాయన్నారు. ‘కొందరు గంటలో 6KMS నడిస్తే, మరికొందరు అంతకంటే తక్కువగా నడుస్తారు. కానీ ఆగకుండా నడుస్తున్నారంటే వారి గుండె ఆరోగ్యంగా ఉన్నట్లే. అందుకే చెడు అలవాట్లను వదిలి, రోజూ నడవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది’ అని తెలిపారు.
Similar News
News November 17, 2025
కాంగ్రెస్ ప్లాన్ B: తప్పించకముందే.. తప్పించుకుంటే!

BRS నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై ఫిరాయింపు వేటు పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ పథకం రచిస్తోంది. అనర్హత వేటు పడకముందే రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఎప్పుడు చేయాలనే విషయం సీఎం నిర్ణయిస్తారని సమాచారం. కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం పోటీచేయడంతో ఆయన అధికారికంగా పార్టీ మారినట్లే లెక్కని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.
News November 17, 2025
అనకాపల్లి: ‘ఐటీఐతో జర్మనీలో ఉద్యోగాలు’

జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన ఎలమంచిలి సూర్య ఐటీఐ కళాశాలలో ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ జిల్లా అధికారి గోవిందరావు తెలిపారు. ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసి రెండేళ్లు అనుభవం ఉన్న అభ్యర్థులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. పాస్ పోర్ట్, విద్యార్హత ధ్రువపత్రాలతో జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. ముందు పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు.
News November 17, 2025
సత్యసాయి భక్తుల కోసం ‘SAI100’ యాప్

పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ‘SAI100’ యాప్ను ఆవిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. యాప్లో రోజు వారీగా ఈవెంట్ కార్యకలాపాలు, వసతి, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, తాగునీటి పాయింట్లు, ఆహార పంపిణీ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర వివరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ యాప్ను భక్తులు, అధికారులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.


