News March 26, 2024

మీ పిల్లలను ఓ కంట కనిపెట్టండి: సజ్జనార్

image

TG: స్నాప్ చాట్‌లో పరిచయం చేసుకుని 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. HYD అమీర్‌పేటలో జరిగిన ఈ ఘటనపై RTC MD సజ్జనార్ స్పందించారు. ‘తల్లిదండ్రులు బిజీ లైఫ్‌ను కాస్త పక్కన పెట్టి పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలి. వారి కదలికలను ఓ కంట కనిపెట్టాలి. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం ఇస్తున్నారా? అనేది తెలుసుకోవాలి. పిల్లలు ముభావంగా ఉంటే వారితో మాట్లాడి ధైర్యం కల్పించాలి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 4, 2024

ఈ నెల 14న‌ హ్యుందాయ్ IPO

image

దేశీయ స్టాక్ మార్కెట్లోనే ₹25,000 కోట్ల అతిపెద్ద‌ హ్యుందాయ్ IPO అక్టోబ‌ర్ 14న ప్రారంభంకానున్న‌ట్టు తెలుస్తోంది. సెబీకి దాఖలు చేసిన కంపెనీ DRHP ప్రకారం సంస్థ‌ భారతీయ విభాగం కంపెనీ, ప్ర‌మోట‌ర్ల ద్వారా 142,194,700 ఈక్విటీ షేర్ల ఆఫర్-ఫర్-సేల్ (OFS)ని ప్రతిపాదించింది. ఈ IPOతో మారుతీ సుజుకి తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా గత 20 ఏళ్లలో ప్రజలకు షేర్లు ఆఫర్ చేస్తున్న మొదటి కార్ల తయారీ సంస్థగా అవతరించనుంది.

News October 4, 2024

కేటీఆర్, హరీశ్‌పై కేసు నమోదు

image

TG: మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సైబరాబాద్‌లో పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో కొండా సురేఖతో ఉన్న ఫొటోలపై ట్రోలింగ్ చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీంతో కేటీఆర్, హరీశ్‌తో పాటు పలు యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News October 4, 2024

నిజం మాట్లాడినందుకు క్షమించండి: కర్ణాటక మంత్రి

image

హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్‌ గొడ్డు మాంసం తినేవారని చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి దినేష్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సావర్కర్ గొడ్డు మాంసం తిన‌డం మాత్ర‌మే కాకుండా, ఆ ఆచారాన్ని బహిరంగంగా ప్రచారం చేశార‌ని చెప్పడంతో వివాదం చెలరేగింది. దీంతో ‘నిజం మాట్లాడినందుకు క్ష‌మించండి’ అని దినేష్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సావర్కర్ బ్రిటిష్ వారికి చెప్పారంటూ పోస్ట్ చేశారు.