News March 20, 2024
మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీగా ఫిన్‌ల్యాండ్
అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్‌ల్యాండ్ వరుసగా ఏడో సంవత్సరం కూడా టాప్‌లో నిలిచింది. డెన్మార్క్, ఐస్‌ల్యాండ్, స్వీడన్, ఇజ్రాయెల్ దేశాలు టాప్-5లో నిలిచాయి. ఇక తాలిబాన్ల రాజ్యం నడుస్తున్న అఫ్గానిస్థాన్ చిట్టచివరన 143వ స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా 10, యూకే 20, అమెరికా 23, జర్మనీ 24, చైనా 64, రష్యా 70వ స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇండియా 126వ ర్యాంకులో నిలిచింది. పాకిస్థాన్ 108వ ప్లేస్ దక్కించుకుంది.
Similar News
News December 26, 2024
ఇకపై అల్ట్రాటెక్ అనుబంధ సంస్థగా ICL
ఇండియా సిమెంట్స్ లిమిటెడ్(ICL)లో ప్రమోటర్లకున్న 32.72 శాతం వాటాను అల్ట్రాటెక్ సొంతం చేసుకుని కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసింది. దీంతో అల్ట్రాటెక్ వాటా 55.49 శాతానికి చేరుకుంది. దీంతో ఇండియా సిమెంట్స్ ఎండీ శ్రీనివాసన్, భార్య చిత్ర, కుమార్తె రూప, ఇతర ప్రమోటర్లు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఇకపై సదరు సంస్థ తమకు అనుబంధంగా కొనసాగుతుందని అల్ట్రాటెక్ వెల్లడించింది.
News December 26, 2024
ఇవాళ టెట్ హాల్‌టికెట్లు విడుదల
TG: జనవరి 2 నుంచి 20 వరకు జరగనున్న టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను నేడు అధికారులు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు https://tgtet2024.aptonline.in/tgtet/లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్స్‌కు 2,48,172 మంది అప్లై చేసుకున్నారు. వీరికి ఉ.9 నుంచి 11.30 వరకు, మ.2 నుంచి 4.30 వరకు రెండు సెషన్లుగా పరీక్షలు ఉండనున్నాయి. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో టెట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
News December 26, 2024
నేడు సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. విజయశాంతి ఏమన్నారంటే?
TG: ఇవాళ సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖులు భేటీ కానుండటంపై విజయశాంతి స్పందించారు. ‘ఈ సమావేశంలో సినీ ఇండస్ట్రీపై విశ్లేషణాత్మక చర్చ జరగాలి. ఇకపై టికెట్ రేట్ల పెంపు ఉండదన్న సీఎం, మంత్రి వ్యాఖ్యలు, సంక్రాంతికి స్పెషల్ షోల అనుమతి, తెలంగాణ సినిమా, సంస్కృతి, చిన్నస్థాయి కళాకారులు, తక్కువ బడ్జెట్ మూవీలకు థియేటర్ల కేటాయింపుపైనా చర్చించాలి. వీటన్నిటిపై ఏకాభిప్రాయం వస్తుందని ఆశిద్దాం’ అని ట్వీట్ చేశారు.