News March 2, 2025

సెబీ మాజీ ఛైర్‌పర్సన్ మాధవీపై FIR.. కోర్టు ఆదేశం

image

ఆర్థిక అవకతవకల వ్యవహారంలో సెబీ మాజీ ఛైర్‌పర్సన్ మాధవీపురి బుచ్, మరో ఐదుగురిపై FIR నమోదు చేయాలని ముంబై ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఆమె పదవిలో ఉండగా రెగ్యులేటరీ ఉల్లంఘనలు, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరిగాయంటూ ఓ జర్నలిస్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆమె పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తు చేసి 30 రోజుల్లో స్టేటస్ రిపోర్టును సమర్పించాలని అధికారులను ఆదేశించింది.

Similar News

News December 9, 2025

గ్లోబల్ సమ్మిట్@ రూ.5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు

image

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. 2 రోజుల పాటు జరిగిన సదస్సులో మొత్తంగా ₹5.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి రోజు ₹2,43,000 కోట్ల ఒప్పందాలు జరగ్గా మిగతా పెట్టుబడులపై 2వ రోజు MOUలు కుదిరాయి. విద్యుత్ రంగంలో ₹3,24,698 కోట్లు, AI, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ వంటి రంగాల్లో ₹70,000 కోట్ల ఒప్పందాలు కుదిరాయి.

News December 9, 2025

పీకల్లోతు కష్టాల్లో భారత్

image

కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి T20లో భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన IND మూడో బంతికే వైస్ కెప్టెన్ గిల్(4) వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సూర్య కుమార్(12) కూడా ఎంగిడి బౌలింగ్‌లోనే గిల్ తరహాలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. అభిషేక్(17) దూకుడుకు బౌలర్ సిపామ్లా బ్రేకులేశారు. IND స్కోర్ 7 ఓవర్లలో 50/3.

News December 9, 2025

తెలంగాణకు పెట్టుబడుల ‘పవర్’

image

TG: గ్లోబల్ సమ్మిట్‌లో పవర్(విద్యుత్) సెక్టార్‌కు భారీగా పెట్టుబడులు వచ్చాయి. మొత్తం రూ.3,24,698 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. వీటి ద్వారా 1,40,500 ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో జెన్‌కో, రెడ్కో, సింగరేణి సంస్థలు వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నాయని వెల్లడించారు.