News February 18, 2025

అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం

image

AP: కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో 140 మంది విద్యార్థులు ఆశ్రమంలో ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. స్థానికులు వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 19, 2026

చరిత్ర సృష్టించిన హర్మన్

image

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించారు. అత్యధిక(356) అంతర్జాతీయ మ్యాచ్‌లు(టెస్టు, ODI, T20) ఆడిన ప్లేయర్‌గా నిలిచారు. ఇవాళ ఆసీస్‌తో రెండో టీ20 ఆడటం ద్వారా ఈ ఘనత సాధించారు. తర్వాతి స్థానాల్లో సుజీ బేట్స్(కివీస్-355M), ఎల్లీస్ పెర్రీ(ఆసీస్- 349M), మిథాలీ రాజ్(ఇండియా-333M) ఉన్నారు. కాగా ఇవాళ్టి మ్యాచ్‌లో భారత్‌పై 19 పరుగుల తేడాతో ఆసీస్ గెలిచింది.

News February 19, 2026

శివుడు విషం తాగిన శంఖం ఉంది ఇక్కడే..

image

మంధర పర్వతాన్ని చిలుకుతుండగా ఉద్భవించిన విషాన్ని శంఖంతో తాగి పరమశివుడు సమస్త లోకాన్ని రక్షించాడు. అయితే ఆ పర్వతం నేటి బీహార్‌లోని బాంకా జిల్లాలో ఉందని నమ్మకం. అలాగే ఇక్కడి ‘శంఖగుండం’ అనే నీటి మడుగులో ఆ దివ్య శంఖం ఉంటుందని చెబుతారు. ఏడాది పొడవునా 80 అడుగుల నీటితో నిండి ఉండే ఈ గుండం, కేవలం మహాశివరాత్రి పర్వదినాన మాత్రమే పూర్తిగా ఎండిపోయి, అడుగున ఉన్న శంఖం భక్తులకు దర్శనమిస్తుంది.

News February 19, 2026

EC ఫారం కోళ్లలో గురక వ్యాధిని నివారించాలంటే?

image

EC (ఎన్విరాన్‌మెంటల్ కంట్రోల్) ఫారంలో కోళ్లకు ఎక్కువగా CRD (గురక వ్యాధి) వస్తుంటుంది. దీనికి కారణం ఫారం లోపల అమ్మోనియా వాయువు ఎక్కువగా విడుదలవ్వడం. ఇలా రిలీజైన అమ్మోనియా వాయువును కోళ్లు ఎక్కువగా పీల్చడం వల్ల వాటికి ఈ గురక వ్యాధి వస్తుంది. దీని పరిష్కారంగా EC షెడ్‌కు రెండు వైపులా వాయువులను బయటకు పంపే ఫ్యాన్లను మాన్యువల్ పద్ధతిలో నడిపించాలి. దీని వల్ల అమ్మోనియా బయటకు పోయి కోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.