News December 24, 2024
ఈఫిల్ టవర్‌లో అగ్ని ప్రమాదం
ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్‌లో అగ్ని ప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి. ఎలివేటర్‌లో మంటలు రావడంతో అగ్నిమాపకశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో టవర్‌పై 1,200 మంది పర్యాటకులు ఉన్నారు. వీరందరిని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పంపారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 25, 2024
సంధ్య థియేటర్ తొక్కిసలాట.. పోలీసుల వార్నింగ్
TG: సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు కొందరు వీడియోలు పోస్టు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని HYD పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై నిజాలను వీడియో రూపంలో ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని తెలిపారు. విచారణ సమయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
News December 25, 2024
అల్లు అర్జున్ కేసు: AP vs TG రంగు కరెక్టేనా?
సంధ్య థియేటర్ తొక్కిసలాట రాజకీయ రంగు పులుముకుంటోంది. కేసులో ప్రధాన నిందితులపై కాకుండా A11 అల్లు అర్జున్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అర్జున్ VS పోలీసులు, అర్జున్ VS రేవంత్‌గా కొనసాగిన నెరేటివ్ ఇప్పుడు AP VS TGగా మారింది. కొందరు కాంగ్రెస్ నేతలు, MLAలు ఆంధ్రావాళ్ల పెత్తనం ఇక్కడేంది? కావాలంటే వెళ్లిపోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీంతో ఆ పార్టీ వైఖరిపై సందేహాలు కలుగుతున్నాయి. మరి మీరేమంటారు?
News December 25, 2024
మోహన్ బాబుకు మరోసారి నోటీసులు?
TG: జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబు ఇంకా అజ్ఞాతం వీడలేదని తెలుస్తోంది. అరెస్టు నుంచి మినహాయిస్తూ హైకోర్టు ఇచ్చిన గడువు నిన్నటితో ముగియగా నేడు ఆయన పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాడి కేసులో మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు చెప్పారు.