News February 28, 2025

త్రివేణీ సంగమం వద్ద అగ్నిప్రమాదం

image

మహా కుంభమేళా జరిగిన ప్రాంతంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో ఓ వ్యక్తి గాయపడగా అతడిని ఆసుపత్రికి తరలించారు. త్రివేణీ సంగమం వద్ద ఉన్న శాస్త్రి బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా మహా కుంభమేళా జరిగిన రోజుల్లోనూ పలుమార్లు అగ్నిప్రమాదాలు సంభవించాయి. బుధవారంతో కుంభమేళా ముగిసింది.

Similar News

News February 28, 2025

పెళ్లిళ్లలో ప్రీ వెడ్డింగ్ షూట్, డీజే బంద్

image

TG: ప్రీ వెడ్డింగ్ షూట్, చెవులు పగిలేలా డీజే డాన్సులు పెళ్లిళ్లలో కామన్ అయిపోయాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలోని ఓ తండావాసులు సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. శివరాత్రి సందర్భంగా ఉట్నూర్ మం. శ్యాం నాయక్ తండా వాసులందరూ సమావేశమై.. ప్రీ వెడ్డింగ్ షూట్, డీజే, హల్దీ వంటి కార్యక్రమాలను నిషేధిస్తున్నామన్నారు. సంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి చేసుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై మీ కామెంట్?

News February 28, 2025

రాష్ట్రంలో 100 కొత్త పోలీస్ స్టేషన్లు?

image

TG: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ట్రాఫిక్ ఠాణాలతోపాటు మహిళా పీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి ఏర్పాటుకు సర్కార్ ఆమోదం తెలపనుంది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 844 పీఎస్‌లు ఉన్నాయి.

News February 28, 2025

మార్చి 5, 6 తేదీల్లో కెరీర్ ఫెయిర్

image

AP: రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్ సంయుక్తంగా విశాఖలోని గీతం వర్సిటీలో MAR 5, 6 తేదీల్లో కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నాయి. ఇందులో IT, ITES రంగానికి చెందిన 49 కంపెనీల్లో యువతీయువకులకు 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. 2024, 2025లో(Tech, Arts, Science, ITI, Polytechnics & Diploma) ఉత్తీర్ణులైన వారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

error: Content is protected !!