News April 3, 2024
ఫిలిం ఛాంబర్ సమీపంలో అగ్నిప్రమాదం

TG: హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని ఫిలిం ఛాంబర్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. స్వరుచి హోటల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News December 29, 2025
మంచిర్యాల: ఆడుకోవద్దన్నందుకు విద్యార్థి సూసైడ్

ఆటలు ఆడుకునేందుకు వెళ్లవద్దన్నందుకు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దండేపల్లి మండలానికి చెందిన శ్రీదేవి-నారాయణ దంపతుల చిన్న కుమారుడు ఆకర్ష్ సోమవారం స్నేహితులతో ఆడుకునేందకు వెళ్తుంటే తల్లి అడ్డుచెప్పింది. ఆటలు మానేసి చదువుకొమ్మని చెప్పినందుకు మనస్తాపంతో ఆకర్ష్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.
News December 29, 2025
మరోసారి ‘ఇండిగో’ విమానాల రద్దు

దేశవ్యాప్తంగా ఇవాళ 118 విమానాలను రద్దు చేసినట్లు ‘ఇండిగో’ తెలిపింది. ప్రతికూల వాతావరణం, ఇతర సమస్యలతో సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు పేర్కొంది. వీటిలో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలున్నాయి. కాగా ఇటీవల ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డ విషయం తెలిసిందే.
News December 29, 2025
జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు

TG: జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని BAC మీటింగ్లో నిర్ణయించారు. 4న ఆదివారం సెలవు ఉండనుంది. దీంతో కొత్త సంవత్సరంలో 5 రోజులు సమావేశాలు జరగనున్నాయి. అయితే, 15 రోజులు అసెంబ్లీని నిర్వహించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలు పక్కదారిపట్టేలా BRS, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయని BJP రాష్ట్రాధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. INC హామీలపై చర్చ జరగాలన్నారు.


