News August 16, 2024

KTRపై ఫైర్.. ‘ఫ్రీ బస్‌’పై మీ అభిప్రాయమేంటి?

image

TG: రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తోన్న మహిళలకు ఫ్రీ బస్‌పై KTR చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మహిళలను KTR కించపరిచారంటూ నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. అయితే ఈ ‘ఫ్రీ బస్’ ఆడవాళ్లకు ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తోందని కొందరంటే, బస్సులో సీట్లే దొరకట్లేదని ఇంకొందరంటున్నారు. ఈ ఫ్రీ బస్‌ స్కీమ్‌పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

Similar News

News November 19, 2025

ASF: సర్పంచ్ ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలి

image

ASF జిల్లాలో సర్పంచ్ ఆశావహులు సిద్ధంగా ఉండాలని డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు సూచించారు. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ 2వ వారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్‌గా బరిలోకి దిగే అభ్యర్థులు, ఆశావహులు డీసీసీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News November 19, 2025

X(ట్విటర్) డౌన్

image

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X(ట్విటర్) డౌన్ అయింది. ట్వీట్లు చేయలేకపోతున్నామని యూజర్లు ఇతర SM పేజీల్లో కామెంట్లు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే తరహా ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? COMMENT

News November 19, 2025

చలికి చర్మం పగులుతుందా?

image

చలి పెరగడంతో శరీరం పగిలి ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేసిన వెంటనే & పడుకునే ముందు మందపాటి, ఆయిల్ ఆధారిత మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాయండి. చలికాలంలో కూడా రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగితే చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్‌గా ఉంచవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి’ అని తెలిపారు.