News September 16, 2024
మళ్లీ కాల్పులు.. ఏకే 47 గుర్తింపు: ట్రంప్ కుమారుడు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సమీపంలో <<14112140>>మరోసారి<<>> కాల్పులు జరగడంపై ఆయన కుమారుడు ట్రంప్ జూనియర్ స్పందించారు. ‘ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ఉన్న ట్రంప్ గోల్ఫ్ కోర్స్‌లో మళ్లీ కాల్పులు జరిగాయి. చెట్ల మధ్య ఏకే 47ను పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ట్రంప్ సురక్షితంగా ఉన్నారు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 8, 2025
ఇవాళ్టి మ్యాచులకు నో ఎంట్రీ!

HYDలోని ఉప్పల్, జింఖానా మైదానాల్లో SMATలో భాగంగా ఇవాళ 4 మ్యాచులు జరగనున్నాయి. అయితే ప్రేక్షకులను అనుమతించకూడదని HCA నిర్ణయించింది. DEC 2న పంజాబ్, బరోడా మధ్య మ్యాచ్ జరగ్గా హార్దిక్, అభిషేక్‌ను చూడటానికి భారీగా ఫ్యాన్స్ వచ్చారు. సరైన సెక్యూరిటీ లేక పలువురు గ్రౌండులోకి వెళ్లి ప్లేయర్లతో సెల్ఫీలు సైతం దిగారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రత దృష్యా ఆడియన్స్‌ను అనుమతించకూడదని నిర్ణయించినట్లు HCA తెలిపింది.
News December 8, 2025
రెచ్చగొట్టేలా జైశంకర్ వ్యాఖ్యలు: పాకిస్థాన్

విదేశాంగ మంత్రి జైశంకర్‌పై పాకిస్థాన్ మండిపడింది. పాక్ ఆర్మీ నుంచే తమకు చాలా <<18486203>>సమస్యలు<<>> వస్తాయని ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ‘ఆయన మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. పాక్ బాధ్యతాయుత దేశం. మా వ్యవస్థలు జాతీయ భద్రతకు మూలం’ అని పాక్ విదేశాంగ శాఖ ఆఫీసు ప్రతినిధి తాహిర్ చెప్పారు. తమపై దాడికి దిగితే దేశాన్ని రక్షించుకోవాలనే పాక్ దళాల సంకల్పానికి మేలో జరిగిన ఘర్షణే రుజువు అంటూ గొప్పలు చెప్పుకొచ్చారు.
News December 8, 2025
ఊల వేసిన మడిలో నీరుంటుందా?

పూర్తిగా పొడిబారిన లేదా ఇసుకతో కూడిన భూమి నీరు త్వరగా ఇంకిపోయే గుణం కలిగి ఉంటుంది. ఆ నేలలో లేదా మడిలో నీరు పోసిన వెంటనే ఇంకిపోతుంది తప్ప, నిలబడి ఉండదు. అలాగే ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత జ్ఞానం బోధించినా, గ్రహించే బుద్ధిలేని వ్యక్తికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఊల మడిలో వేసిన నీరులాగే ఇంకిపోతాయి. మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం లేని వారి గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.


