News August 14, 2025

పాక్‌ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి!

image

పాక్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో అపశ్రుతి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కరాచీ సిటీలో పలుచోట్ల వేడుకల్లో భాగంగా కొందరు నిర్లక్ష్యంగా గన్స్ ఫైర్ చేయడంతో ముగ్గురు మరణించారని, 60 మందికి పైగా గాయాలపాలైనట్లు Geo News వెల్లడించింది. మృతుల్లో ఎనిమిదేళ్ల బాలిక కూడా ఉందని పేర్కొంది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలిపింది. కాగా గత JANలోనూ ఈ తరహా కాల్పుల్లో 42 మంది చనిపోయినట్లు సమాచారం.

Similar News

News August 14, 2025

ఇండిపెండెన్స్ డే: 1090 మందికి గ్యాలంట్రీ అవార్డ్స్

image

రేపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా కేంద్ర హోం శాఖ పోలీసులకు గ్యాలంట్రీ అవార్డ్స్ ఇవ్వనుంది. ఈ మేరకు పోలీస్, ఫైర్, హోమ్ గార్డ్&సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్‌లో 1090 మందికి పురస్కారాలు ప్రకటించింది. వీటిల్లో గ్యాలంట్రీ మెడల్స్(GM) 233, రాష్ట్రపతి మెడల్స్(PSM) 99, మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్(MSM) 758 ఉన్నాయి. తెలంగాణకు MSM 18, PSM 2, GM 1, ఆంధ్రప్రదేశ్‌కు MSM 23, PSM 2 మెడల్స్ ప్రకటించింది.

News August 14, 2025

జిల్లా టాపర్లకు రూ.10,000

image

TG: ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో టెన్త్, ఇంటర్ చదివి జిల్లా టాపర్లుగా నిలిచిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. ప్రతి జిల్లాలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలకు రూ.10,000 చొప్పున ఇవ్వనుంది. స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ఈ బహుమతులు ఇవ్వాలని, స్కూళ్లు, జిల్లా స్థాయిలో ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ సూచించింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించాలని ఆదేశించింది.

News August 14, 2025

కొత్త వాహనాలు కొంటున్నారా?

image

TG: రాష్ట్రంలో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్‌ను ప్రభుత్వం పెంచింది. ఎక్స్‌షోరూం ధరను బట్టి ద్విచక్ర వాహనాలకు 3, కార్లు, ఇతర వ్యక్తిగత వాహనాలకు 5 శ్లాబుల్లో పన్ను విధించనుంది. తక్కువ ధర వెహికిల్స్‌పై ఈ ప్రభావం ఉండదు. బైక్ ధర ₹లక్ష దాటితే 3%, ₹2 లక్షలు మించితే 6%, కార్ల ధర ₹10 లక్షలు దాటితే 1% ట్యాక్స్ పెరగనుంది. ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చే ఈ పన్నులతో కొనుగోలుదారులపై సుమారు రూ.3 వేల భారం పడనుంది.