News July 15, 2024
ట్రంప్‌పై కాల్పులు.. ధ్రువ్ రాఠి ట్వీట్ వైరల్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరపడంపై యూట్యూబర్ ధ్రువ్ రాఠి స్పందించారు. ‘డొనాల్డ్ ట్రంప్ దాదాపు హత్యకు గురైన పరిస్థితి. ఎందుకంటే అమెరికాలో ఎవరైనా సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌ను పొందవచ్చు. అమెరికాలో ప్రతి సంవత్సరం 40,000 మంది కాల్పుల కారణంగా మరణిస్తున్నారు. అయినా దీనిని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆయుధ మాఫియాను నియంత్రించేందుకు ట్రంప్, బైడెన్ పెద్దగా కృషి చేయలేదు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 24, 2026
ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్.. ధర ఎంతంటే?

iPhone 18 ప్రో సిరీస్‌కు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ డైనమిక్ ఐలాండ్‌తో కాకుండా అండర్ డిస్ప్లే ఏరియాతో రానున్నట్లు సమాచారం. కొత్తగా 2nm టెక్నాలజీతో తయారైన A20 ప్రో చిప్‌తో పాటు కెమెరాలో మెకానికల్ ఐరిస్ వంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబరులో లాంచ్ కావొచ్చు. ధర విషయానికి వస్తే 18 ప్రో రూ.1,34,900, ప్రో మ్యాక్స్ రూ.1,49,900గా ఉండొచ్చు.
News January 24, 2026
468రోజుల తర్వాత సూర్యకుమార్ హాఫ్ సెంచరీ

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ రెండో T20లో పరుగుల వరద పారించారు. 23 ఇన్నింగ్సుల(468 రోజులు) సుధీర్ఘ ఎదురు చూపులకు హాఫ్ సెంచరీతో చెక్ పెట్టారు. అది కూడా 23 బంతుల్లోనే పూర్తి చేయడం విశేషం. T20WC నేపథ్యంలో తన ఫామ్‌పై వస్తున్న అనుమానాలను ఈ ఇన్నింగ్స్‌తో పటాపంచలు చేశారు. అలాగే సూర్య భారత్ తరఫున అత్యధిక T20I మ్యాచులు(126) ఆడిన లిస్ట్‌లో కోహ్లీ(125)ని దాటేశారు. రోహిత్(159) తొలిస్థానంలో ఉన్నారు.
News January 24, 2026
జనవరి 24: చరిత్రలో ఈరోజు

1757: బొబ్బిలి యుద్ధం ప్రారంభం
1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా స్వీకరించిన భారత ప్రభుత్వం
1966: భారత ప్రధానిగా ఇందిరా గాంధీ(ఫొటోలో) బాధ్యతలు స్వీకరణ
1966: అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా మరణం
1981: సినిమా నటి కాంచనమాల మరణం
* జాతీయ బాలికా దినోత్సవం


