News March 6, 2025
తొలి 5 సెంచరీలు ఐసీసీ టోర్నీల్లోనే.. రచిన్ రికార్డ్

న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర వన్డేల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తన తొలి 5 సెంచరీలనూ ఐసీసీ టోర్నీల్లోనే చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. 2023 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై 123*, ఆసీస్‌పై 116, పాక్‌పై 108, CT-2025లో బంగ్లాపై 112, నిన్న సౌతాఫ్రికాపై 108 రన్స్ బాదారు. కాగా ఇప్పటివరకు 32 వన్డేలు ఆడిన రచిన్ 44.29 యావరేజ్, 108.72 స్ట్రైక్ రేటుతో 1,196 పరుగులు చేశారు.
Similar News
News January 28, 2026
అజిత్ మరణం వెనుక కుట్ర లేదు: శరద్ పవార్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదని ఎన్సీపీ అధినేత, ఆయన పెద్దనాన్న శరద్ పవార్ స్పష్టం చేశారు. ఈ ప్రమాదాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని సూచించారు. ఇది పూర్తిగా ఓ యాక్సిడెంట్ అని పేర్కొన్నారు. కాగా అజిత్ మరణంలో కుట్ర కోణం ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
News January 28, 2026
అజిత్ పవార్ మృతి.. 3 రోజులు సంతాప దినాలు

మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. దీంతో 3 రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు బంద్ కానున్నాయి. రేపు 11amకు పవర్ అంత్యక్రియలు నిర్వహించనుండగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. మరోవైపు అజిత్ మృతదేహం ఉన్న బారామతి ఆస్పత్రి వద్దకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు.
News January 28, 2026
అమిత్ షాతో పవన్ భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తాజా రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలను చర్చించామని ఆయన ట్వీట్ చేశారు. ఉప్పాడ తీరంలో గోడ నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. తన ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులనూ పవన్ కలిశారు. కాసేపట్లో విశాఖకు బయల్దేరనున్నారు.


