News April 29, 2024
అమిత్ షా డీప్ఫేక్ వీడియో కేసులో తొలి అరెస్ట్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీప్ <<13146071>>ఫేక్<<>> వీడియో కేసులో ఒకరు అరెస్ట్ అయ్యారు. రీతోమ్ సింగ్ అనే వ్యక్తిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేసినట్టు సీఎం హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. ఈ ఫేక్ వీడియో కేసుపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు.
Similar News
News December 31, 2025
పట్టుకోరు.. పట్టించుకోరు అనుకుంటున్నారా..?

రెగ్యులర్గా హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు జరుగుతాయి. కానీ న్యూ ఇయర్ టైంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పట్టణంలోనూ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఊర్లో ఉన్నాం కదా ఎవరూ పట్టుకోరు, పట్టించుకోరు అనుకోవద్దు. ఆల్కహాల్ తాగి బయటకి వస్తే పట్టుకోవడం పక్కా అని ఖాకీలు అంటున్నారు. So Be Careful.
– హైదరాబాద్లో కాసేపటి క్రితమే టెస్టింగ్స్ మొదలయ్యాయి.
News December 31, 2025
Jan-1 సెలవు.. మీకు మెసేజ్ వచ్చిందా..?

చాలా MNC, ఇండియన్ మేజర్ ఐటీ కంపెనీల్లో క్రిస్మస్ నుంచి మొదలైన హాలిడేస్ రేపటితో ముగియనున్నాయి. అటు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లోని పలు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు రేపు సెలవు ఉంటుందని పేరెంట్స్కు మెసేజ్ పంపాయి. JAN-1 ఆప్షనల్ హాలిడే కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ విచక్షణతో సెలవుపై నిర్ణయం తీసుకోవచ్చు. మీకు హాలిడే మెసేజ్ వచ్చిందా..?
News December 31, 2025
2026 రిపబ్లిక్ పరేడ్.. చరిత్రలో తొలిసారి యానిమల్ కంటింజెంట్

2026 రిపబ్లిక్ డే పరేడ్లో కొత్తగా యానిమల్ కంటింజెంట్ ప్రదర్శన జరగనుంది. సైన్యంలోని రీమౌంట్ & వెటర్నరీ కార్ప్స్లో శిక్షణ తీసుకున్న జంతువులు కవాతు చేయనున్నాయి. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో బార్డర్ల వెంబడి భద్రతకు ఉపయోగించే 2 బాక్ట్రియన్ ఒంటెలు, 4 రాప్టార్లు, 10ఇండియన్ బ్రీడ్ ఆర్మీ, 6 కన్వెన్షనల్ మిలిటరీ డాగ్స్ ప్రదర్శనలో పాల్గొంటాయి. లద్దాక్కు చెందిన జన్స్కార్ పోనీలు కవాతు చేయనున్నాయి.


