News October 10, 2025
మొదట గూగుల్.. ఇప్పుడు మెటా: లోకేశ్

AP: మెటా సంస్థ తన సబ్‌సీ కేబుల్ ప్రాజెక్ట్ ‘వాటర్ వర్త్’ను వైజాగ్‌కు తీసుకురావాలని భావిస్తోందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. Economic Timesలో ప్రచురితమైన కథనాన్ని షేర్ చేశారు. ఇండియాలో AI నగరంగా, డేటా సిటీగా విశాఖను ఇది మరింతగా ఎస్టాబ్లిష్ చేస్తుందని పేర్కొన్నారు. తొలుత గూగుల్ డేటా సెంటర్, ఇప్పుడు మెటా అంటూ ఆయన పోస్టు పెట్టారు.
Similar News
News October 10, 2025
కారాగారాలు కాదు… కర్మాగారాలు

నేరాలు, నేరారోపణలతో ఖైదీలుగా మారిన పలువురు జైళ్లలో తమ నైపుణ్యాలతో ఏటా వందల కోట్ల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఐదేళ్లలో ₹1900 కోట్లను అవి ఆర్జించాయని ఇటీవల NCRB ప్రకటించింది. అత్యధికంగా 2019లో ₹846 కోట్ల ఆదాయం రాగా 2023లో జైళ్లు ₹274 కోట్లు ఆర్జించాయి. అందులో TN ₹67CR, TG ₹56 కోట్లు, ఏపీ ₹12 కోట్లు సాధించాయి. ఫర్నీచర్, దుస్తులు, ఆహార పదార్థాలు, వివిధ పంటలు ఇలా పలు రకాలు ఉత్పత్తి అవుతున్నాయి.
News October 10, 2025
AP క్యాబినెట్ నిర్ణయాలు

*పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణానికి ఆమోదం
*అమరావతిలో సదరన్ గ్రూప్ హోటల్ కట్టేందుకు గ్రీన్ సిగ్నల్
*అమరావతిలో రూ.400 కోట్లతో దసపల్లా 4స్టార్ హోటల్ నిర్మాణానికి ఆమోదం
*అనంతపురంలో 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకారం
*రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించిన క్యాబినెట్
*పలు సంస్థలకు భూ కేటాయింపులు, సబ్సిడీలకు అంగీకారం
*ఓర్వకల్లులో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రాజెక్టుకు ఆమోదం
News October 10, 2025
ఏ దేవుడికి ఏ నూనెతో దీపం వెలిగించాలి?

ఇష్టదైవాన్ని ఆరాధించేటప్పుడు శ్రేయస్సు, ప్రతిష్ఠల కోసం ఆముదం నూనెతో దీపం వెలిగించాలి.
ఆంజనేయుడి కటాక్షం పొందడానికి మల్లెపూల నూనెతో దీపారాధన చేయాలి.
శత్రువుల నుంచి రక్షణ పొందడానికి కాలభైరవుడి ఆలయంలో ఆవనూనెతో దీపం వెలిగించాలి.
ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్య భగవానుడి అనుగ్రహం కోసం ఆవాల నూనెతో దీపారాధన చేయాలి.
రాహు, కేతు వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం తొలగిపోవడానికి, మునగ నూనెతో దీపం వెలిగించాలి.