News January 7, 2025

తొలి హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు

image

TG: చెరువుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా తొలి పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. బుద్ధ భవన్‌లోని బి-బ్లాక్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా కార్యకలాపాలన్నీ ఈ స్టేషన్ ద్వారా నిర్వహిస్తారు. ఏసీపీ స్థాయి అధికారి నిర్వహణను చూస్తారు. దీనికి తగిన సిబ్బందిని కేటాయించాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. చెరువులు, నాలాల ఆక్రమణలపై ప్రజలకున్న ఫిర్యాదుల్ని ఈ స్టేషన్లో స్వీకరిస్తారు.

Similar News

News August 27, 2025

ఈ జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు

image

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ఉండనుంది. మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. మీ జిల్లాలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.

News August 27, 2025

గోదావరి పరీవాహక ప్రజలు జాగ్రత్త!

image

TG: గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అది 4 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందన్నారు. మంజీరా నది వరద అంతా SRSPలోకి రానుంది. అటు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం ప్రవాహం పెరగనుంది.

News August 27, 2025

అర్హులెవరికీ అన్యాయం జరగదు: చంద్రబాబు

image

AP: అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని పార్టీ యంత్రాంగానికి CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్య నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘రూ.500ల దివ్యాంగుల పెన్షన్‌ రూ.6 వేలు చేశాం. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. ప్రజలకు ఎంతో చేస్తున్నాం. చేసింది చెప్పుకుందాం. జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం. రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు చేస్తున్నాం’ అని తెలిపారు.