News November 13, 2024

5 సార్లు డకౌట్ అయిన తొలి ఇండియన్ ప్లేయర్

image

సౌతాఫ్రికాతో మూడో టీ20లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ డకౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో టీ20ల్లో ఒక్క ఇయర్‌లో 5సార్లు డకౌట్ అయిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా శాంసన్ నిలిచారు. అయితే, T20Iలో వరుసగా రెండు సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్ కూడా ఈయనే. సంజూ ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో తొలి రెండింటిలో సెంచరీలు బాదగా.. చివరి రెండింట్లో డకౌటై పెవిలియన్ చేరారు. తిరిగి ఫామ్‌లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Similar News

News October 27, 2025

కుక్కలా పని చేస్తున్నారంటూ పోస్ట్.. థాంక్స్ చెప్పిన ట్రంప్

image

US కోసం ట్రంప్ కుక్కలా పని చేస్తున్నారని ఉన్న ఓ SM పోస్ట్‌ను ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘థాంక్యూ.. అమెరికా గొప్ప పురోగతి సాధిస్తుంది’ అని దానికి క్యాప్షన్ ఇచ్చారు. ‘ఎలాంటి డబ్బు ఆశించకుండా ట్రంప్ కుక్కలా పని చేస్తున్నారు. అయినా ఆయన త్యాగాన్ని ఈ దేశం గుర్తించట్లేదు’ అని ఆ పోస్టులో రాసి ఉంది. దీంతో ట్రంప్ తనకు తానే లవ్ లెటర్స్ రాసుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

News October 27, 2025

పిలవని పేరంటానికి అందుకే వెళ్లొద్దంటారు

image

పిలవని పేరంటానికి వెళ్లడం ఆపదనే తెస్తుందనడానికి సతీదేవి కథే నిదర్శనం. దక్షుడు యాగానికి శివుడిని, సతీదేవిని ఆహ్వానించలేదు. అయినా పుట్టింటిపై మమకారంతో సతీదేవి భర్త శివుడి మాటను కాదని, బలవంతంగా ఆ యాగశాలకు వెళ్లింది. అక్కడ దక్షుడు శివుడిని అవమానించడం చూసి, ఆ అవమానాన్ని భరించలేకపోయింది. యోగాగ్నిలో దేహత్యాగం చేసింది. పిలవని చోటికి వెళ్లడం వల్ల ఎంతటి నష్టం కలుగుతుందో ఈ ఘటన మనకు చెబుతోంది.<<-se>>#Shakthipeetham<<>>

News October 27, 2025

సింగర్ మృతి.. చివరి సినిమాకు భారీ క్రేజ్

image

అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ SEP 19న సింగపూర్‌లో <<17805488>>మృతిచెందిన<<>> సంగతి తెలిసిందే. ఆయన లీడ్ రోల్ నటించి, మ్యూజిక్ అందించిన చివరి సినిమా ‘రోయ్ రోయ్ బినాలే’ OCT 31న విడుదలవుతోంది. టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా గంటలోనే 15K+ అమ్ముడయ్యాయి. BMSలో ఇప్పటివరకు 98K+ ఇంట్రస్ట్‌లు నమోదయ్యాయి. దీంతో ఇది ₹100CR గ్రాస్ కలెక్షన్స్ సాధించే తొలి అస్సామీ సినిమాగా నిలిచే అవకాశం ఉందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.