News October 1, 2024
HYD నుంచి సైన్యానికి చేరిన మొదటి స్వదేశీ సబ్మెషీన్ గన్స్

ASMI పేరుతో భారత్లో డెవలప్ చేసిన మొదటి సబ్మెషీన్ గన్స్ సైన్యం చేతికి అందాయి. వీటి డిజైన్, డెవలప్మెంట్, తయారీకి మూడేళ్ల కన్నా తక్కువ సమయమే పట్టింది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఇజ్రాయెల్ Uzi, జర్మనీ MP5 కన్నా ఇవెంతో మెరుగ్గా పనిచేస్తాయి. పైగా వాటితో పోలిస్తే 10-15% బరువు, 30% ధర తక్కువ. రూ.లక్ష లోపే లభిస్తాయి. హైదరాబాద్ కంపెనీ లోకేశ్ మెషీన్స్ 550 ASMITA గన్స్ను ఆర్మీకి డెలివరీ చేసింది.
Similar News
News November 13, 2025
ఆగాకర సాగు.. ఇలా నాటితే ఎక్కువ ప్రయోజనం

ఆగాకరను విత్తనం, దుంపలు, తీగ కత్తిరింపుల ద్వారా ప్రవర్థనం చేస్తారు. 2-3 సంవత్సరాల వయసుగల దుంపలు నాటుటకు అనుకూలం. తీగ కత్తిరింపుల ద్వారా అయితే 2-3 నెలల వయసున్న తీగ కత్తిరింపులను ఎంచుకోవాలి. విత్తనం ద్వారా నాటుకోవాలంటే గుంతకు 4-5 విత్తనాలు నాటుకోవాలి. ఇవి పూతకు వచ్చినప్పుడు మగ మొక్కలను తీసి గుంతకు 2-3 ఆరోగ్యవంతమైన ఆడ మొక్కలను ఉంచాలి. దుంపల ద్వారా నాటడం రైతులకు శ్రేయస్కరం.
News November 13, 2025
స్వస్తివచనం ఎందుకు చేయాలి?

చేయబోయే పనులు విజయవంతం కావాలని, మనతో పాటు చుట్టూ ఉన్న అందరికీ మేలు కలగాలని కోరుతూ పలికే పవిత్ర ప్రార్థననే ‘స్వస్తి వచనం’ అంటారు. సంకల్పంతో కొన్ని ప్రార్థనలు చేయడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది. మన పనులకున్న అడ్డంకులు తొలగిపోతాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తే, ఆ సానుకూల శక్తి తిరిగి మనకే బలాన్నిస్తుంది. లక్ష్యాలకు విజయాన్ని చేరుస్తుంది. అందుకే ఏ కార్యాన్ని మొదలుపెట్టినా స్వస్తివచనం తప్పక ఆచరించాలి.
News November 13, 2025
ప్రెగ్నెన్సీలో జామపండ్లు తినొచ్చా?

జామపండ్లలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ బి6, పొటాషియం, ఫైబర్, లుటిన్ వంటి పోషకాలు ఉన్నాయి. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వీటిని తినడం వల్ల హైడ్రేటెడ్గా ఉండటంతో పాటు జెస్టేషనల్ డయాబెటీస్ రాకుండా ఉంటుంది. అలాగే శిశువులో నాడీలోపాలు రాకుండా, తల్లిలో యాంగ్జైటీ రాకుండా చూస్తుందని చెబుతున్నారు.


