News April 3, 2025
‘అమరావతి’కి తొలి విడత రుణం.. ఖాతాలో రూ.3,535 కోట్లు జమ

AP: రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు తొలి విడతలో రూ.3,535 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ నిధులు ఇవాళ ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. త్వరలోనే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు(ADB) నుంచీ తొలి విడత రుణం మంజూరవుతుందని ప్రభుత్వ పెద్దలు తెలిపారు. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు, ADB రూ.6,700 కోట్లు చొప్పున రుణం ఇస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా రూ.1,400 కోట్లు ప్రత్యేక సాయంగా అందిస్తోంది.
Similar News
News October 14, 2025
ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్: WHO

భారత్లోని 3 ఫార్మా కంపెనీలకు చెందిన కాఫ్ సిరప్లను వాడొద్దని WHO హెచ్చరించింది. ఇందులో ఇటీవల 22 మంది పిల్లల మరణానికి కారణమైన శ్రేసన్ ఫార్మా ‘కోల్డ్రిఫ్’ కూడా ఉంది. దాంతో పాటు రెడ్నెక్స్ ఫార్మా ‘రెస్పిఫ్రెష్ TR’, షేప్ ఫార్మా ‘రీలైఫ్’ సిరప్లు ఆరోగ్యానికి హానికరమని పేర్కొంది. కాగా ఈ దగ్గు మందులు ఇతర దేశాలకు ఎగుమతి కాలేదని ఇండియన్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ WHOకు తెలిపింది.
News October 14, 2025
MCTEలో 18 పోస్టులు

క్యాడెట్స్ ట్రైనింగ్ వింగ్ ఆఫ్ మిలటరీ కాలేజీ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (MCTE)18 అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ, ఎంఎస్, MSc, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 31 వరకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.
News October 14, 2025
రోజూ ఓంకారం జపిస్తే..?

శివుడి దివ్య సందేశం ప్రకారం.. శివుడి ధ్యానాన్ని విడవడమే మానవులలో అజ్ఞానం ప్రవేశించడానికి కారణం. నిజమైన జ్ఞానంతో ఉంటే మనుషులు కూడా శివుడితో సమానమైన సారూప్యాన్ని పొందే అవకాశం ఉండేది. అందుకే, అహంకారాన్ని నిర్మూలించి, జ్ఞానసిద్ధి పొందడానికి ఓంకారాన్ని జపించాలని శివుడు ఉపదేశించాడు. శివుడి ముఖం నుంచే జనించిన ఈ సర్వ మంగళప్రదమైన ఓంకారాన్ని నిత్యం స్మరిస్తే, శివుడిని స్మరించినట్లే అవుతుంది. <<-se>>#SIVOHAM<<>>