News August 17, 2024
వక్ఫ్ సవరణ బిల్లుపై 22న JPC తొలి భేటీ

వక్ఫ్ సవరణ బిల్లు-2024పై అధ్యయనానికి ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ సంఘం ఈ నెల 22న తొలిసారి భేటీ కానుంది. ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ, న్యాయశాఖ ప్రతినిధులు బిల్లు వివరాలను సభ్యులకు వివరించనున్నారు. బీజేపీ సీనియర్ నేత ఎంపీ జగదంబికాపాల్ ఈ JPCకి ఛైర్మన్గా ఉన్నారు. ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం చెప్పడంతో కేంద్రం JPCని నియమించింది.
Similar News
News November 21, 2025
బీసీలకు 22% రిజర్వేషన్లు ఖరారు!

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22శాతం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు 42శాతం ఇవ్వాలని ప్రభుత్వం భావించినా కోర్టు కేసుల వల్ల సాధ్యపడలేదు. దీంతో 2019లో ఇచ్చినట్లే రాష్ట్రవ్యాప్తంగా 22శాతం ఇవ్వనుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కలవడం వల్ల మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.