News October 25, 2024

తొలిరోజు రాత్రి జైలులో.. చంద్రబాబు ఎమోషనల్

image

AP: నంద్యాలలో అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ పేరుతో రాత్రంతా తిప్పారని సీఎం చంద్రబాబు అన్నారు. ‘మనం చేయని తప్పుకు శిక్ష అనుభవించడమే కాకుండా అరెస్ట్ చేసిన పద్ధతితో నా గుండె తరుక్కుపోయింది. వెనకాల నుంచి ‘బాధ్యత’ గుర్తొస్తోంది. నేను నిరుత్సాహపడటం సరికాదు. ఎక్కడిక్కడ అన్నింటిని ఎదుర్కొన్నాను. ఆశయం కోసం పనిచేయడమే శాశ్వతమని, ముందుకెళ్లాలని భావించాను’ అని అన్‌స్టాపబుల్ షోలో ఎమోషనల్ అయ్యారు.

Similar News

News October 17, 2025

రన్స్ చేస్తే ఓకే.. చేయలేదో!

image

INDvsAUS మధ్య 3 మ్యాచుల వన్డే సిరీస్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. దీంతో అందరి దృష్టి స్టార్ ప్లేయర్లు విరాట్, రోహిత్‌లపైనే ఉంది. వచ్చే వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో స్థానం దక్కాలంటే వీరు ఈ సిరీస్‌లో రాణించడం కీలకం. అదే విఫలమయ్యారో ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే వారి ప్రాతినిధ్యంపై సెలక్షన్ కమిటీ, కోచ్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా AUSలో వీరిద్దరికీ మంచి రికార్డ్ ఉంది. రోహిత్, కోహ్లీ చెరో 5 సెంచరీలు బాదారు.

News October 17, 2025

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం భగభగలు

image

అంతర్జాతీయ మార్కెట్‌(COMEX)లో బంగారం ధరలు రికార్డులు తిరగరాస్తున్నాయి. నిన్న ఔన్సు $4250 ఉండగా, ఇవాళ అది $4300 దాటేసింది. అంతేకాకుండా మార్కెట్ క్యాప్‌ విలువ $30 ట్రిలియన్స్‌ క్రాస్ అయింది. ఒక అసెట్ ఈ మార్క్‌ను దాటడం చరిత్రలో ఇదే మొదటిసారి. US-చైనా ట్రేడ్ వార్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి గ్లోబల్ టెన్షన్స్ వల్లే పెట్టుబడిదారులు బంగారాన్ని సేఫ్‌ అసెట్‌గా భావిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

News October 17, 2025

కావేరి నదీ ఎలా పుట్టిందంటే?

image

పురాణాల ప్రకారం.. బ్రహ్మదేవుని కుమార్తె అయిన కావేరిని, కావేర ముని దత్తత తీసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న అగస్త్య మహాముని, దైవ చర్చలలో మునిగి, ఆమెను నిర్లక్ష్యం చేశాడు. దీంతో అసహనానికి గురైన ఆమె అగస్త్య ముని స్నానపు తొట్టిలో పడిపోయింది. అనంతరం కావేరి నదిగా జన్మించింది. ప్రజలకు మేలు చేయాలనే తన లక్ష్యాన్ని కావేరి ఇలా నేరవేర్చుకుంది. కార్తీక మాసంలో ఈ నదిలో స్నానాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.