News May 24, 2024
ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై తొలి నివేదిక

ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై ఆ దేశ ఆర్మీ తొలి నివేదిక విడుదల చేసింది. హెలికాప్టర్ ముందుగా నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించిందని, రూట్ దాటి వెళ్లలేదని తెలిపింది. ప్రమాదానికి 90sec ముందు ఆ చాపర్ పైలట్ కాన్వాయ్లోని ఇతర హెలికాప్టర్లను కాంటాక్ట్ చేశారని పేర్కొంది. శకలాల్లో బుల్లెట్లు, పేలుడు పదార్థాల ఆధారాలు కనిపించలేదని, కొండను ఢీకొని చాపర్లో మంటలు చెలరేగాయని వివరించింది.
Similar News
News November 20, 2025
MDK: పెన్షన్ల పెంపు ఇంకెన్నడో ?

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామని ఎన్నికల ముందు ప్రచార సభలో హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్ల కావొస్తున్నా పెన్షన్ పెంపు ముచ్చట లేదు. ఒంటరి మహిళలు, నేత కార్మికులు, వృద్ధులకు రూ.4,000 దివ్యాంగులకు రూ.6,000 వరకు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 4,69,575 మంది పింఛన్ దారులు పెంపు కోసం ఎదురు చూస్తున్నారు.
News November 20, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.170 తగ్గి రూ.1,24,690కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పతనమై రూ.1,14,300 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,73,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 20, 2025
బొప్పాయి కోత, రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బొప్పాయిని దూరంగా ఉండే మార్కెట్లకు పంపాలంటే వాటిపై ఆకుపచ్చ రంగు నుంచి 1,2 పసుపు చారలు రాగానే కోయాలి. దగ్గరి మార్కెట్లలో విక్రయించాలంటే కొంచెం మాగిన కాయలను కోయాలి. బొప్పాయిని కోశాక పాలు ఆరేవరకు నీడలో ఉంచాలి. లేకుంటే కాయలపై మచ్చలు పడి నాణ్యత దెబ్బతింటుంది. కాయలకు విడివిడిగా న్యూస్ పేపర్ చుట్టి ప్యాకింగ్ చేయాలి. బొప్పాయి రవాణా చేసే వాహనాల అడుగున, పక్కల వరిగడ్డి పరిస్తే నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.


