News October 26, 2024

12 ఏళ్లలో తొలిసారి స్వదేశంలో సిరీస్ ఓటమి

image

4331 రోజులుగా అనేక మేటి జట్లు భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలవలేకపోయాయి. ఈ 12 ఏళ్లలో ఏ దేశానికీ సాధ్యంకాని రికార్డును న్యూజిలాండ్ సాధించింది. 2012 తర్వాత స్వదేశంలో సిరీస్ ఓటమి తెలియని భారత్‌ను సునాయాసంగా ఓడించింది. మూడు మ్యాచుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుచుకుంది. న్యూజిలాండ్‌కు భారత్‌లో ఇదే తొలి సిరీస్ విజయం. భారత్‌కు 18 సిరీస్‌ విజయాల తర్వాత ఇదే తొలి ఓటమి.

Similar News

News October 26, 2024

దూకుడే కొంపముంచిందా?

image

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో అనుసరించిన వ్యూహాలను న్యూజిలాండ్‌తో రిపీట్ చేయడం భారత జట్టు ఘోర పరాజయానికి కారణమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్న జట్లపై దూకుడు మంత్రం ఫలించినా న్యూజిలాండ్ వంటి జట్టుపై ఆచితూచి ఆడాల్సిందని చెబుతున్నారు. ముఖ్యంగా భాగస్వామ్యాలు నెలకొల్పడంపై ఆటగాళ్లు దృష్టి సారిస్తే చారిత్రక పరాజయం ఖాతాలో చేరేది కాదని అంటున్నారు. మరి మీరేమంటారు?

News October 26, 2024

నవంబర్ 4 వరకు ఆ సేవలు నిలిపివేత

image

AP: భవన నిర్మాణాలు, లేఅవుట్లకు ఆన్‌లైన్‌లో పర్మిషన్లు ఇచ్చే పోర్టల్‌లో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో నవంబర్ 4 వరకు ఆన్‌లైన్ అనుమతుల సేవలు నిలిపివేసినట్లు DPMS డైరెక్టర్ తెలిపారు. సర్వర్ మైగ్రేషన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

News October 26, 2024

టీమ్ ఇండియాకు బ్యాడ్ డేస్

image

గత రెండు వారాల్లోనే భారత పురుషుల జట్టు, మహిళల, యువకుల జట్లు ఘోర పరాజయాలు ఎదుర్కొన్నాయి. కివీస్‌పై మెన్స్ టీమ్ 36 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఆసియా కప్‌లో ఉమెన్స్ టీమ్ సెమీ ఫైనల్‌కు వెళ్లలేకపోయింది. దుబాయ్‌లో జరిగిన ఎమర్జింగ్ టోర్నీ సెమీ ఫైనల్‌లో పసికూన అఫ్గానిస్థాన్‌పై భారత యువ జట్టు ఓడి ఫైనల్‌కు చేరలేకపోయింది. దీంతో భారత జట్టుకు ఇవి మంచి రోజులు కావంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.