News April 4, 2025
ఎల్లుండి ‘పెద్ది’ ఫస్ట్ షాట్, రిలీజ్ డేట్ గ్లింప్స్

బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. శ్రీరామ నవమి సందర్భంగా ఎల్లుండి ఉదయం 11.45 గంటలకు పెద్ది ఫస్ట్ షాట్‌తోపాటు రిలీజ్ డేట్ గ్లింప్స్‌ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. మ్యూజిక్ మిక్సింగ్ పూర్తయ్యిందంటూ ఏఆర్ రెహమాన్‌తో దిగిన ఫొటోను బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Similar News
News April 12, 2025
‘యువ వికాసం’ సర్వర్ డౌన్

TG: <<16017360>>రాజీవ్ యువ వికాసం పథకానికి<<>> దరఖాస్తు గడువు ఎల్లుండితో ముగియనుంది. అయితే 2, 3 రోజులుగా వెబ్సైట్ సర్వర్ డౌన్ అవుతుండటంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. వివరాలు నమోదు చేస్తుండగానే వెబ్‌పేజీ నిలిచిపోతోంది. దీంతో మళ్లీ మొదటినుంచి ప్రారంభించాల్సి వస్తోంది. సమస్యను పరిష్కరించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కాగా ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
వెబ్సైట్: <
News April 12, 2025
రిజల్ట్స్ అంటేనే వే2న్యూస్..

కొన్నాళ్లుగా ఎగ్జామ్ రిజల్ట్స్ అంటే Way2Newsలో చూడాలి అనేలా పరిస్థితి మారిపోయింది. దీనికి మన సూపర్‌ఫాస్ట్ టెక్నాలజీ ఒక కారణం. వెబ్సైట్లలో క్లిక్ చేసినప్పుడు ప్రమాదకర లింక్స్ ఓపెన్ అవడం వల్ల గతంలో పడిన ఇబ్బందులు ఇక్కడ లేకపోవడం మరో కారణం. సింపుల్‌గా చెప్పాలంటే మన యాప్‌లో రిజల్ట్స్ సూపర్ ఫాస్ట్, సింపుల్, సేఫెస్ట్.
-నేటి AP ఇంటర్ రిజల్ట్స్ కూడా ముందుగా, సేఫ్‌గా మన వే2న్యూస్‌లో..
News April 12, 2025
జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని చత్రు ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రదాడిలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ వీరమరణం పొందినట్లు వెల్లడించారు.