News April 19, 2024

మెగా డీఎస్సీపై తొలి సంతకం: CBN

image

AP: కూటమి అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని చంద్రబాబు అన్నారు. జగన్ ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా యువత భవిష్యత్తును నాశనం చేశారని ఫైరయ్యారు. తాము పోలీసు ఉద్యోగాలు ఇస్తామని, యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఏడాదికి రూ.20వేలు అందజేయడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని రాయదుర్గం సభలో చంద్రబాబు చెప్పారు.

Similar News

News November 19, 2024

సన్నబియ్యం పంపిణీ ఆలస్యం!

image

TG: రేషన్ కార్డుదారులకు సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పినా 3 నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేస్తే బియ్యంలో నూక శాతం పెరుగుతుందని, అన్నం ముద్దగా మారుతుందని అధికారులు తెలిపారు. కనీసం 3 నెలల పాటు ధాన్యాన్ని తప్పకుండా నిల్వ చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో ఉగాది నుంచి ఈ స్కీం అమలయ్యే అవకాశం ఉంది.

News November 19, 2024

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ అప్‌డేట్స్

image

☛ ఈనెల 23 నుంచి మ్యాచులు ప్రారంభం, DEC 15న ఫైనల్
☛ ముంబై కెప్టెన్‌గా శ్రేయస్. జట్టులో రహానె, పృథ్వీ షా, శార్దూల్‌కు చోటు
☛ బెంగాల్ జట్టుకు ఎంపికైన మహ్మద్ షమీ
☛ UP కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్, జట్టులో సభ్యులుగా రింకూ సింగ్, నితీశ్ రాణా, యశ్ దయాల్, మోసిన్ ఖాన్.
☛ HYD టీమ్ కెప్టెన్‌గా తిలక్ వర్మ, కర్ణాటక కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్
☛ జియో సినిమా యాప్‌లో లైవ్ మ్యాచులు .

News November 19, 2024

అరకులో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత

image

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 8.9 డిగ్రీలు, డుంబ్రిగుడలో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తెలంగాణలోని తిర్యాణి (ఆసిఫాబాద్), జహీరాబాద్ (సంగారెడ్డి)లో 12.1 టెంపరేచర్ రికార్డయింది. హైదరాబాద్ BHELలో 13.3 డిగ్రీలుగా ఉంది. నవంబర్ 28 వరకు చలి ఇలాగే కొనసాగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు.