News April 14, 2024

సాయంత్రం 6 గంటలకు ఫస్ట్ సింగిల్

image

దళపతి విజయ్, దర్శకుడు ప్రభు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు హీరో విజయ్ ట్వీట్ చేశారు. ఈ పాటను స్వయంగా విజయ్ పాడటం గమనార్హం. కాగా ఈ చిత్రంలో విజయ్ డ్యుయల్ రోల్‌లో కనిపించనున్నారు. స్నేహ, మీనాక్షి చౌదరీ, ప్రశాంత్, ప్రభుదేవా తదితర భారీ తారాగణంతో మూవీ తెరకెక్కుతోంది.

Similar News

News March 18, 2026

ఆయిల్ పామ్ సాగులో వెనుకబడొద్దు: కలెక్టర్ రిజ్వాన్ బాషా

image

సంప్రదాయ పంటల కంటే ఆయిల్ పామ్ సాగుతోనే రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం గద్వాల ఐడీఓసీలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయిల్ పామ్ సాగులో జిల్లా చివరి స్థానంలో ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలని, లక్ష్యాలను చేరుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 18, 2026

భారత్‌లో తెలంగాణ అంతర్భాగం కాదా: మంత్రి పొన్నం

image

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ఫైరయ్యారు. ‘BJP నుంచి 8 మంది MPలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. రాష్ట్రానికి ఏం తెచ్చారు? రావాల్సిన నిధులు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. భారత్‌లో TG అంతర్భాగం కాదా? నిధులు ఎందుకు కేటాయించరు? రాష్ట్ర ఏర్పాటు విషయంలో తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని BJP కేంద్ర నేతలు అంటే రాష్ట్ర నేతలు ఎందుకు మాట్లాడలేదు’ అని ప్రశ్నించారు.

News March 18, 2026

ఇంటికే గ్యాస్.. ఏజెన్సీల వద్ద వేచి ఉండొద్దు: కేంద్రం

image

గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్ద గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఏజెన్సీల వద్దకు వెళ్లొద్దని, సిలిండర్లను నేరుగా ఇంటికే పంపిణీ చేస్తామని వెల్లడించింది. IVRS, వాట్సాప్, మొబైల్ యాప్, <<19379922>>మిస్డ్‌కాల్<<>>, UPI యాప్స్‌ల ద్వారా బుక్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలు ఆందోళన చెందకుండా ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించింది.