News June 19, 2024
వాగ్దానం అమలుకు తొలి అడుగు: జనసేన శతఘ్ని

AP: ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ DCM పవన్ కళ్యాణ్ తొలి సంతకం చేశారు. ఈక్రమంలో ఎన్నికల హామీల్లో ఓ వాగ్దానం అమలుకు తొలి అడుగు పడిందని ‘జనసేన శతఘ్ని’ ట్వీట్ చేసింది. వ్యవసాయంలో ఉన్నవారంతా లబ్ధి పొందేలా వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకం కిందకు తీసుకొస్తామని జనసేన మేనిఫెస్టోలో పొందుపరిచింది.
Similar News
News November 27, 2025
డెలివరీ తర్వాత ఈ లక్షణాలున్నాయా?

డెలివరీ తర్వాత మహిళల్లో అనేక మార్పులు వస్తాయి. జుట్టు ఎక్కువగా రాలడం, శారీరక మార్పులు, వాపు, మలబద్ధకం, కాళ్లు, పాదాల్లో వాపు వంటి సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించాలంటే పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఇవి కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి. కానీ ఎన్ని రోజులైనా వీటి నుంచి ఉపశమనం లభించకపోతే, అశ్రద్ధ చేయకుండా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.
News November 27, 2025
బాధ్యతలకు విరుద్ధంగా గవర్నర్ కామెంట్స్: CM స్టాలిన్

తమిళనాడులో లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయని, రాష్ట్రం ఉగ్రవాద ధోరణితో ఉందని గవర్నర్ ఆర్‌ఎన్ రవి కామెంట్స్‌ను సీఎం స్టాలిన్ తప్పుబట్టారు. ఉగ్ర దాడుల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడలేని కేంద్రాన్ని అదే పనిగా ఆయన ప్రశంసిస్తున్నారని CM మండిపడ్డారు. శాంతికి నిలయమైన తమిళనాడును ఉగ్రవాద రాష్ట్రమంటున్న గవర్నర్ అహంకారాన్ని అణిచివేస్తామన్నారు. బాధ్యతలకు విరుద్ధంగా గవర్నర్ కామెంట్స్ ఉన్నాయని CM మండిపడ్డారు.
News November 27, 2025
మీ ఇంట్లో ‘దక్షిణామూర్తి’ చిత్రపటం ఉందా?

శివుడి జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి. ఇంట్లో ఆయన చిత్రపటం ఉంటే అది సకల శుభాలు, అష్టైశ్వర్యాలకు మార్గమని పండితులు, వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అపమృత్యు దోషాలు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు ఆయనను ఆరాధిస్తారు. దక్షిణామూర్తి దర్శనంతో పిల్లల్లో విద్యా బుద్ధులు వికసించి, జ్ఞానం, ఏకాగ్రత సిద్ధిస్తాయని నమ్మకం.
☞ దక్షిణామూర్తి విగ్రహాన్ని ఇంట్లో ఏ రోజున ప్రతిష్ఠించాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


