News October 17, 2024

తొలి టెస్ట్: 134 పరుగుల ఆధిక్యంలో NZ

image

బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో 46 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన NZ రెండో రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. కాన్వే(91), యంగ్(33) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్, అశ్విన్, జడేజా తలో వికెట్ తీశారు.

Similar News

News January 28, 2026

రూ.1,002 కోట్లు.. తొలి ఇండియన్ సినిమాగా ధురంధర్

image

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇండియాలోనే రూ.1,002కోట్ల (గ్రాస్) వసూళ్లు సాధించింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా హిందీలో విడుదలై వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా రికార్డులకెక్కింది. షారుఖ్ ఖాన్ జవాన్ (రూ.760) రికార్డులు బద్దలుకొట్టింది.

News January 28, 2026

చంద్రబాబు అరకు పర్యటన రద్దు

image

AP: సీఎం చంద్రబాబు రేపటి అరకు పర్యటన రద్దైంది. విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గురువారం ఆయన బారామతి వెళ్లనున్నారు. దీంతో రేపటి పర్యటనను రద్దు చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీఎం‌తో పాటు మంత్రి లోకేశ్‌ కూడా అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.

News January 28, 2026

టేబుల్‌టాప్ రన్‌వేలు ఎందుకు డేంజరస్?

image

* పీఠభూమి/కొండపై రన్‌వేతో 2 వైపులా లోయలు ఉండటం.
* రన్‌వే హారిజాంటల్‌గా, తక్కువ దూరం ఉన్నట్టు కనిపించడం.
* బ్రేకింగ్, గో అరౌండ్‌కు రన్‌వే పొడవు తక్కువగా ఉండటం.
* ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో అకాల వర్షం, టైల్‌విండ్, తక్కువ విజిబిలిటీతో ల్యాండింగ్‌.
* పైలట్లు తప్పుగా అంచనా వేసి ఓవర్‌షూట్/అండర్‌షూట్ చేసే ఛాన్స్.
* ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టం వంటి అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ సపోర్ట్ లేకపోవడం.